Mana Enadu : విపరీతమైన చలితో నార్త్ ఇండియా వణుకుతోంది. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలోని ప్రముఖ టూరిస్టు ప్రాంతం ప్రాంతమైన మనాలీ లో మంచు కురుస్తోంది. భారీగా మంచు కురుస్తుండటంతో అక్కడికి వెళ్లిన పర్యాటకులు నానా అవస్థలు పడుతున్నారు. రోహింగ్ లోని సొలాంగ్, అటల్ టన్నెల్ల మధ్య సోమవారం రాత్రి తర్వాత దాదాపు 1000కి పైగా వెహికిల్స్ మంచు లో చిక్కుకుపోయాయి. దీంతో పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.
గత కొన్ని రోజులుగా భారీగా మంచు (Snow blanket) కురుస్తుండటంతో మనాలీకి టూరిస్టులు ఎక్కువ మంది వచ్చారు. డిసెంబర్ 23 సాయంత్రం నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. దట్టమైన మంచు కురుస్తుండటంతో ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వెహికిల్స్ ముందుకు వెళ్లలేక భారీగా ట్రాఫిక్ అయ్యింది.
ఇప్పటికే 700 మందిని కాపాడిన పోలీసులు
ఇక, రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 700 మంది టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు పంపించారు. ప్రస్తుతం అటల్ టన్నెల్ మార్గంలో వాహనాల రాకపోకలు స్లోగా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
We are committed to providing support and assistance to make your experience in Lahaul Spiti pleasant and worry-free. If you need any help or have concerns, please don’t hesitate to reach out to us, we are always ready to assist you.
Sh.Mayank Chaudhary, IPS pic.twitter.com/kbEbZhmxOB
— Lahaul & Spiti Police (@splahhp) December 23, 2024
అలాగే, హిమాచల్ ప్రదేశ్( Himachal Pradesh) రాష్ట్ర రాజధాని సిమ్లాలోనూ (Shimla) భారీగా మంచు కురుస్తోంది. హిమపాతం వల్ల రాష్ట్రంలోని పలు రోడ్లను అధికారులు తాత్కాలికంగా బంద్ చేశారు. క్రిస్మస్ పండగ న్యూ ఇయర్ ఉన్న నేపథ్యంలో డిసెంబర్ చివరి వారంలో మనాలీకి పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తూనే ఉంటారు. కొద్ది రోజులుగా వేల సంఖ్యలో వాహనాలు ఈ ప్రాంతానికి వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
జమ్మూ కశ్మీర్ లో మైనస్ 9 డిగ్రీలకు చేరిన చలి
కాగా జమ్మూ కశ్మీర్ లో (Jammu and Kashmir) ఎప్పుడు లేనంతగా మంచు కురుస్తోంది. ఏకంగా మైనస్ 9 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో అక్కడ నీటి సరస్సులు మొత్తం గడ్డకట్టిపోతున్నాయి. దాదాపు వందేళ్లలో ఇప్పటి వరకు ఇంతలా ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు లేవని వాతావరణ శాఖ (Meteorological Department)అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే డాల్ సరస్సు పూర్తిగా గడ్డకట్టుకుపోయింది. దీంతో చలికి అక్కడిప్రజలు వణికిపోతున్నారు.






