Allu Arjun: అల్లు అర్జున్ మరో అరుదైన ఘనత.. ఏంటంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) మరో అరుదైన ఘనత సాధించాడు. సినీవర్గాలు ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది హాలీవుడ్ రిపోర్టర్(The Hollywood Reporter India)’ మ్యాగజైన్ కవర్ పేజీపై స్థానం దక్కించుకున్నాడు. పుష్ప: ది రైజ్, దాని సీక్వెల్ పుష్ప: ది రూల్ మూవీలతో చారిత్రాత్మక విజయంతో టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పాన్-ఇండియా స్టార్‌డమ్‌(Stardom)ను సాధించాడు. సుకుమార్(Sukumar) దర్శకత్వం వహించిన పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా రూ.1871 కోట్లకు పైగా వసూలు చేసి, అన్ని సినీ ఇండస్ట్రీలలో అత్యధిక వసూళ్లు(Collections) చేసిన రెండవ భారతీయ చిత్రంగా అవతరించింది.

కవర్ పేజీలో పరిచయం చేస్తూ..

పుష్ప ఫ్రాంచైజీ సాధించిన అఖండ విజయంతో అల్లు అర్జున్ ఇప్పుడు అరుదైన ఘనతను సాధించాడు. ప్రతిష్ఠాత్మక ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ మ్యాగజైన్ ప్రారంభ సంచికలో అల్లు అర్జున్‌ను కవర్ పేజీ(Cover Page)లో పరిచయం చేస్తూ “తెలుగులో చిత్రీకరించబడిన పుష్ప-2 చిత్రంతో, అల్లు అర్జున్ హిందీ సినిమా చరిత్రను సృష్టించాడు. అతను ఒక్క హిందీ మాట కూడా మాట్లాడకుండానే దేశ హృదయాన్ని జయించాడు” అని The Hollywood Reporter ఇండియా రాసింది.

ఆదరణ పొందినా 5.5 రేటింగ్ ఇచ్చుకున్నాడు..

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అల్లు అర్జున్ అంతటి ప్రజాదరణ పొంది, ఉత్తమ నటుడిగా ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డు(National Award)ను గెలుచుకున్నప్పటికీ, నటుడిగా బన్నీ తనకు 5.5 రేటింగ్ ఇచ్చుకున్నాడు. కాగా ఇక బన్నీ తన తర్వాత మూవీని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌(Director Trivikram Srinivas)తో చేయనున్నారు. అలాగే స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్‌తోనూ ఓ మూవీకి అల్లుఅర్జున్ ఓకే చెప్పినట్లు టాక్.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *