Allu Arjun: చిరు ఇంటికి అల్లు అర్జున్

Mana Endau : హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి, ఆమె కొడుకు తీవ్ర అనారోగ్యానికి గురైన ఘటనలో అరెస్టైన ప్రముఖ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టైన విషయం తెలిసిందే. ఒక రోజు జైల్లో గడిపిన బన్నీ మధ్యంతర బెయిల్పై విడుదలయ్యాడు. దీంతో అర్జున్ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టారు. అయితే తన రిలీజ్ విషయంలో కీలకపాత్ర పోషించిన చిరంజీవిని (Chiranjeevi)కలిసేందుకు ఆయన ఇంటికి ఐకాన్ స్టార్ వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం12 గంటలకు చిరు ఇంటికి చేరుకొని ఆయనను కలిసినట్లు సమాచారం.

బన్నీ అరెస్ట్‌ అయిన రోజున చిరంజీవి, సురేఖ దంపతులు అల్లు అర్జున్‌ నివాసానికి చేరుకొని కుటుంబసభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. బన్నీ అరెస్ట్ తర్వాత మొదటగా అల్లు ఫ్యామిలీని కలిశారు చిరంజీవి. విశ్వంభర (vishwambhara) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన షూట్ క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు బయలుదేరినప్పటికీ భద్రతా పరిణామాల దృష్ట్యా చిరుని పోలీస్ స్టేషన్లోకి అనుమతించ లేదు. దీంతో ఆయన బన్నీ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి న్యాయవాదులను సంప్రదించి రిలీజ్లో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.

పుష్ప 2 (Pushpa 2) బెనిఫిట్‌ షో సమయంలో సంధ్య థియేటర్‌ (sandhya theatre incident) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో శుక్రవారం ఉదయం పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ రాత్రంతా ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు. దీంతో అతడికి సంఘీభావం తెలుపుతూ నటులు, ప్రముఖలు బన్నీ ఇంటికి వెళ్లి కలిశారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరినట్లు సమాచారం. హైదరాబాద్‌కు చేరుకుని అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సంధ్యా థియేటర్ ఘటన, అరెస్టు గురించి బన్నీ టీమ్‌ని అడిగి వివరాలు తెలుసుకోనున్నారు పవన్. పవన్ తో దర్శకుడు త్రివిక్రమ్ కూడా రానున్నారు.

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *