Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2 The Rule). ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కథానాయికగా నటించింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది. విడుదలైన రోజు నుంచి రికార్డులు బద్ధలు కొడుతున్న ఈ సినిమా తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. మరి పుష్పరాజ్ ఖాతాలో చేరిన మరో రికార్డు ఏంటంటే..?
హిందీలో పుష్పరాజ్ హవా
పుష్ప-2 సినిమా పది రోజుల్లోనే హిందీ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రం కేవలం బాలీవుడ్ లోనే రూ.507.50 కోట్లు కలెక్షన్లు (Pushpa 2 Hindi Collections) కురిపించింది. హిందీలో అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన సినిమాగా పుష్ప-2 రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని షేర్ చేస్తూ.. ‘పుష్ప 2 ది రూల్’ రికార్డుల పరంపర కొనసాగుతోందని మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు.
వేయి కోట్ల క్లబ్ లోకి పుష్ప-2
ఇక పుష్ప-2 సినిమా సంగతికి వస్తే.. 2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్ (Pushpa The Rise)’కు కొనసాగింపుగా డిసెంబరు 5న ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2 The Rule) రిలీజ్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మికతో పాటు ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ చిత్రం రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. అలా అతి తక్కువ సమయంలో రూ.1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన సినిమాగా సంచలనం సృష్టించింది.








