ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన సినిమా ‘పుష్ప-2 : ది రూల్ (Rashmika Mandanna)’. రష్మిక మందన్న హీరోయిన్ గా.. నటించిన ఈ సినిమా డిసెంబరు 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఏకంగా రూ.1800 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక థియేటర్లలో ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.
Pushpa ante fire kadhu…. he’s a wild fire 🔥
Watch Pushpa 2 on Netflix, coming soon in Telugu, Tamil, Malayalam & Kannada!#Pushpa2OnNetflix pic.twitter.com/TUAFovmzmX— Netflix India (@NetflixIndia) January 29, 2025
మరికొన్ని గంటల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ పై పుష్పరాజ్ (Pushpa2OnNetflix) రూల్ చేయబోతున్నాడు. బుధవారం అర్ధరాత్రి నుంచి పుష్ప-2 సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. గురువారం నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. నెట్ ఫ్లిక్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ ప్రకటనతో బన్నీ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు.






