SSMB29 మూవీలో మరో బాలీవుడ్ స్టార్!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబోలో SSMB29 సినిమా వస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఇటు జక్కన్న ఫ్యాన్స్.. అటు మహేశ్ బాబు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది.

సస్పెన్స్ క్రియేట్ చేసిన జక్కన్న

కానీ ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా జక్కన్న(SS Rajamouli) జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక కొత్త ఏడాదిలో ఈ సినిమా ముచ్చట్లు తెలియజేస్తూ జక్కన్న ప్రెస్ మీట్ నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఇలా మహేశ్ బాబుతో సినిమా విషయంలో జక్కన్న చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. ఈ సస్పెన్స్ ను అభిమానులు మాత్రం తట్టుకోలేకపోతున్నారు.

మహేశ్ తో ప్రియాంకా

ఇక ఈ పాన్ వరల్డ్ మూవీలో గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) కూడా భాగమైనట్లు తెలిసిందే. ఈ బ్యూటీ ఇటీవల లాస్ ఏంజిల్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చింది. ఈ సమయంలో ఈ భామకు స్క్రీన్ టెస్ట్ నిర్వహించినట్లు సమాచారం. దీనిపైనా జక్కన్న టీమ్ అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఇక తాజాగా ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు భాగం కానున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

SSMB29లో బాలీవుడ్ స్టార్

బీ టౌన్ స్టార్ హీరో, కండల వీరుడు జాన్ అబ్రహం (John Abraham) SSMB29 సినిమాలో భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్  నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అతడి కాల్షీట్లు ఖాళీ లేకపోవడంతో ఆ స్థానంలో జాన్ అబ్రహంను సంప్రదించినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *