సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని సీపీ సీవీ ఆనంద్ (CV Anand) తెలిపారు. న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ లో మీడియా సమావేశంలో సీవీ ఆనంద్ మాట్లాడారు. ఘటన సమయంలో అల్లు అర్జున్ వద్దకు వెళ్లేందుకు ఎస్‌హెచ్‌వో కూడా తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందన్నారు. అల్లు అర్జున్ వచ్చేందుకు థియేటర్ వాళ్లు దరఖాస్తు చేస్తే తిరస్కరించామని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. కాగా థియేటర్ యాజమాన్యం ఆయనకు ఏం చెప్పిందో తెలియదన్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) మేనేజర్ సంతోష్ వద్దకు వెళ్లి తొక్కిసలాట విషయం చెప్పామని ఏసీపీ రమేశ్ కుమార్ తెలిపారు. ఒక బాలుడు పరిస్థితి విషమంగా ఉందని.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించామని చెప్పారు. మేనేజర్ మమ్మల్ని అల్లు అర్జున్ వద్దకు వెళ్లనీయలేదని చెప్పారు. అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్లి అల్లు అర్జున్‌కు విషయం చెప్పామని అన్నారు. కానీ సినిమా చూసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్తామని చెప్పారని అన్నారు. 10 నిమిషాలు చూసిన తర్వాత డీసీపీ ఆదేశాల మేరకు అల్లు అర్జున్‌ను బయటకు తీసుకొచ్చామని వివరించారు. అల్లు అర్జున్ నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బౌన్సర్లకు హెచ్చరికలు
బౌన్సర్ల సప్లై ఏజెన్సీలకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్లు (Bouncers) ఇకపై పోలీసులను ముట్టుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే.. ఊరుకునేది లేదని అన్నారు. బౌన్సర్ల ప్రవర్తనకు సప్లై ఏజెన్సీలదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజల ఇబ్బంది గురించి ఆలోచించే బాధ్యత వీఐపీలదే అని పేర్కొన్నారు.
ఓయూ జేఏసీ నిరసన
ఆదివారం సాయంత్రం సమయంలో అల్లు అర్జున్ ఇంటి ఆవరణకు వెళ్లి ఓయూ జేఏసీ (OU JAC) నిరసనలు తెలిపింది. అంతటితో ఆగకుండా జేఏసీ నేతలు ఇంటిపైకి రాళ్లు, టమాటాలు విసిరారు. ఇంటి ఆవరణలో ఉన్న పూలకుండీలను ధ్వంసం చేశారు. కాంపౌండ్ వాల్ ఎక్కి ఆందోళనలు చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో జేఏసీ నేతలను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
In the #SandhyaTheatre & Allu Arjun case-CP Hyderabad City Police CV Anand shows the footage of irregularities that led to the death of a #woman. ACP Chikkadpally, "I have informed Allu Arjun that a woman has expired but he insisted on staying." pic.twitter.com/HNCSp51Ge7
— Deepika Pasham (@pasham_deepika) December 22, 2024






