Mana Enadu : 2024 డిసెంబర్ చివరి వారం వచ్చేసింది. ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే.. ఎన్నో అంచనాల మధ్య, ఎంతో హైపుతో రిలీజ్ అయిన సినిమాలు బోర్లపడ్డాయి. ఇక ఈ చివరి వీకెండ్ లోనూ పలు సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. ఇక ఈ ఏడాది ఓటీటీలో సూపర్ హిట్ సినిమాలు, సిరీస్ లు ప్రేక్షకులను అలరించింది. లాస్ట్ వీక్ లోనూ ఆడియెన్స్ ను అలరించేందుకు మరికొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్ లు వచ్చేస్తున్నాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దామా..?
థియేటర్ లో సందడి చేయనున్న సినిమాలివే..
బరోజ్ త్రీడీ : మోహన్ లాల్ నటిస్తూ తెరకెక్కించిన సినిమా బరోజ్ త్రీడీ. ఈ నెల 25న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ : వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్. ఈ నెల 25న థియేటర్లలో విడుదల చేయనుంది.
మాక్స్ : న్నడ స్టార్ సుదీప్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మాక్స్’. డిసెంబర్ 27న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
బేబీ జాన్ : కీర్తి సురేశ్, వరుణ్ ధావన్ కలిసి నటించిన సినిమా బేబీ జాన్. డిసెంబర్ 25న ఈ మూవీ విడుదల కానుంది.
ఈ వారం ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!
నెట్‌ఫ్లిక్స్
- ది ఫోర్జ్ (హాలీవుడ్) డిసెంబరు 22
- ఓరిజిన్ (హాలీవుడ్) డిసెంబరు 25
- స్క్విడ్ గేమ్ 2 (కొరియన్) డిసెంబరు 25
- భూల్ భూలయ్య3 (హిందీ) డిసెంబరు 27
- సార్గవాసల్ (తమిళ) డిసెంబరు 27
అమెజాన్ ప్రైమ్
- సింగం అగైన్ (హిందీ) డిసెంబరు 27
థానర (మలయాళం) డిసెంబరు 27
జియో సినిమా
- డాక్టర్స్ (హిందీ సిరీస్) డిసెంబరు 27
- డిస్నీ+హాట్‌స్టార్
- వాట్ ఇఫ్..? 3 (యానిమేషన్ సిరీస్) డిసెంబరు 22
- డాక్టర్ వూ (హాలీవుడ్ మూవీ) డిసెంబరు 26
జీ5
- ఖోజ్ (హిందీ) డిసెంబరు 27






