పుష్ప-2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ఓ భారీ ప్రాజెక్టు సైన్ చేసిన విషయం తెలిసిందే. తమిళ్ డైరెక్టర్ అట్లీ(Atlee), అల్లు అర్జున్ కాంబోలో AA22xA6 మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచే అభిమానుల్లో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. అయితే పుష్ప-2 రిలీజ్ తర్వాత బన్నీ ఈ ప్రాజెక్టు కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పటికీ దీని ప్రీ ప్రొడక్షన్ పనులు(Pre-production work) శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వర్క్ తర్వాత ఈ చిత్రం షూటింగ్‌కు షురూ కానుంది. ఇందులోభాగంగానే తొలి షెడ్యూల్(First Schedule)ను ముంబైలో చిత్రీకరించనున్నారట. మూడు నెలల పాటు అక్కడే షూటింగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో యాక్షన్ సీన్స్ తీయనున్నారట.
రంగంలోకి అమెరికా నుంచి టెక్నికల్ టీమ్
ఇప్పటికే ఈ షెడ్యూల్ తర్వాత VFX పనులను ప్రారంభించనున్నట్లు టాక్. ఈ షెడ్యూల్ కోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా ఓ టెక్నికల్ టీమ్ ముంబై వస్తోందని టీటౌన్‌లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా ఈ సైన్స్-ఫిక్షన్ ఫాంటసీ(Science-fiction fantasy) మూవీ కోసం బన్నీ ముంబైకి షిఫ్ట్ అవుతున్నాడు. ఏకంగా 3 నెలల పాటు ఈ షెడ్యూల్ ప్లాన్ చేయడంతో అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడట. ప్రత్యేకంగా వేసిన బ్లూ-మ్యాట్ సెట్(Blue-matte set)లో ఈ సినిమా షూటింగ్ ఏకధాటిగా జరగనున్నట్లు సమాచారం.

బన్నీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపిక
కాగా ఈ మూవీ సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మాణసంస్థపై భారీ బడ్జెట్‌తో ఇది రూపొందనుంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone).. ఇందులో బన్నీకి జోడీగా కనిపించనుంది. ఈక్వెల్ వరల్డ్, పునర్జన్మల కాన్సెప్ట్‌తో ముడిపడి ఉండే సైన్స్‌ఫిక్షన్ సినిమాగా దీనిని తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికోసం మేకర్స్ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉన్నారు. కాగా ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.








