అల వైకుంఠపురములో సినిమా సూపర్ హిట్ కావడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో వచ్చే కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ తరువాత ఆయన పవన్ కళ్యాణ్ సినిమాలకు మాటలు, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ వంటివి చేసినా, పూర్తి స్థాయి దర్శకత్వం వహించిన సినిమా మాత్రం ఇంకా రాలేదు.
ఇటీవల మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్ కార్యక్రమంలో నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. త్రివిక్రమ్, అల్లు అర్జున్(Allu Arjun) కాంబినేషన్‌లో కుమార స్వామి జీవితం ఆధారంగా ఓ మైథలాజికల్ ప్రాజెక్ట్ రూపొందబోతోందని ప్రకటించి భారీ హైప్ క్రియేట్ చేశారు. ఈ చిత్రం అల్లు అర్జున్‌కు ఒకే కాకపోతే, త్రివిక్రమ్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు? అనే అనుమానాలు అప్పటికే మొదలయ్యాయి.
ఈ ప్రెస్టీజియస్ మైథలాజికల్ ప్రాజెక్ట్ బన్నీ నుంచి జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) వద్దకు చేరిపోయిందని టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉండడంతో, త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్‌ను ఎన్టీఆర్‌కు అప్పగించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి ధృవీకరణ రాకపోయినా, పరిశ్రమ వర్గాల్లో మాత్రం ఇదే చర్చ సాగుతోంది.
గతంలో త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఒక సినిమా ప్రకటించి తర్వాత అది కుదరకపోవడం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే కాంబోను రీ-విజిట్ చేయబోతున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత దేవర 2 సినిమా కూడా ప్రారంభం కానుంది. ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తయ్యే లోపు త్రివిక్రమ్ సినిమా ఆరంభం అవ్వడం కష్టమేనని తెలుస్తోంది.






