ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప 2 : ది రూల్ (Pushpa 2 : The Rule)’ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1800 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంత భారీ వసూళ్లు సాధించిన సినిమా లేదు. ఇక ఈ సినిమాలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్, శ్రీవల్లిగా రష్మిక మందన్న (Rashmika Mandanna)ల నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ఫిదా అయ్యారు. ఈ చిత్రంలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా ఆడియెన్స్ ను అలరించింది.
పుష్ప-3 రిలీజ్ డేట్
ముఖ్యంగా పుష్ప 2లో జాతర సీన్ లో అల్లు అర్జున్, రష్మికలు తమ నటనతో మెస్మరైజ్ చేశారు. ఈ సీన్ వచ్చినప్పుడు థియేటర్లలో పూనకాలు వచ్చాయి. ఇక పుష్ప ఫ్రాంఛైజీలో డైరెక్టర్ సుకుమార్ (Sukumar) మరో సినిమా కూడా ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పుష్ప-2 రిలీజ్ ఆ తర్వాత సంధ్య థియేటర్ ఘటన తర్వాత పుష్ప పార్ట్-3 గురించి ఏ రకమైన ప్రకటన చేయలేదు. కానీ తాజాగా ఈ సినిమాను నిర్మిస్తున్న ప్రముఖ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థకు చెందిన నిర్మాత రవి మాత్రం పుష్ప-3 గురించి ఓ అప్డేట్ ఇచ్చారు.
పుష్ప రాజ్ ఆగమనం
ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్ రాబిన్ హుడ్ (Robinhood) సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా విజయవాడలో నిర్వహించిన ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్ ఈ సినిమా నిర్మాత మైత్రి రవి అల్లు అర్జున్ పుష్ప పార్ట్-3 (Pushpa 3 Release Date) గురించి ఓ క్రేజీ అప్డేట్ షేర్ చేసుకున్నారు. పుష్ప 3 సినిమాను 2028లో విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ఆయన ప్రకటనతో బన్నీ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. పుష్ప రాజ్ ఆగమనం అంటూ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. పుష్ప రాజ్ మళ్లీ వచ్చేస్తున్నాడంటూ ఈ న్యూస్ ను వైరల్ చేస్తున్నారు.
సుకుమార్ ప్లాన్ ఏంటో?
ఇప్పటికే అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీ (Atlee)తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు త్రివిక్రమ్ తో కూడా ఓ మూవీ చేయనున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాల తర్వాత పుష్ప-3 చేస్తాడా లేదా అట్లీ చిత్రం తర్వాతే ఈ సినిమా ఉంటుందో తెలియాల్సి ఉంది. మరోవైపు సుకుమార్ రామ్ చరణ్ (Ram Charan)తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చెర్రీ బుచ్చిబాబుతో ఓ చిత్రం చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాకే సుకుమార్ మూవీ ఉంటుంది. మరి సుకుమార్ మొదటి చెర్రీతో చేస్తాడా లేక బన్నీతో చేస్తాడో చూడాల్సి ఉంది.






