
తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్లలో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ఒకరు. అ..ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ‘శతమానం భవతి(Shatamanam Bhavathi)’ సినిమాతో పక్కింటి అమ్మాయి పేరును సంపాదించుకుంది మలయాళ కుట్టీ. ఈ అమ్మడు మరోసారి శర్వానంద్(Sharwanand)తో జతకట్టనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వీరిద్దరూ కలిసి నటించిన శతమానం భవతి సినిమాలో వీరి మధ్య కెమిస్ట్రీ చాలా వర్కవుటైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత అనుమప మళ్లీ శర్వానంద్‌తో కలిసి సినిమా చేయలేదు.
త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్
ఈ నేపథ్యంలోనే మళ్లీ ఈ జంట ఇన్నేళ్లకు కలిసి నటించబోతున్నట్టు తెలుస్తోంది. శర్వానంద్ హీరోగా సంపత్ నంది(Sampath Nandi) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ను సెలక్ట్ చేశారని సమాచారం. రీసెంట్‌గా చిత్ర బృందం ఈ విషయమై అనుపమని కలిసినట్టు తెలుస్తోంది. ఇందుకు ఈ మలయాళి భామ సుముఖుంగానే ఉందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వీలుంది.
ఆ మూవీ తర్వాతే కొత్త ప్రాజెక్టు
కాగా రీసెంట్‌గా అనుపమ నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్(Return of the Dragon)’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీలో అనుపమ చిన్న పాత్రలోనే కనిపించినప్పటికీ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్ ఫోకస్ మొత్తం మళ్లీ అనుపమ వైపు మళ్లింది. ప్రస్తుతం ‘‘నారీ నారీ నడుమ మురారీ’’ సినిమాతో పాటూ అభిలాష్(Director Abhilash) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న శర్వానంద్ త్వరలోనే సంపత్ మూవీని పట్టాలెక్కించనున్నాడు.