Mana Enadu:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2(Pushpa 2). ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పుష్ప(Pushpa) తర్వాత రెండో పార్ట్‌పై భారీ అంచనాలు ఉన్న విషయం స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. పుష్ప2కి దాదాపు అన్ని భాషల్లోనూ హౌస్ ఫుల్ షోస్ పడతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకోసం మూవీ టీం కూడా ప్రమోషన్స్(Promotions)కు డిఫరెంట్ స్టైల్లో చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇటీవల బిహార్ క్యాపిటల్ పాట్నాలో నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమానికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ప్రమోషన్స్ క్రియేవిటీలోనూ కొత్త స్ట్రాటజీని వాడుతోంది పుష్ప టీమ్.
హైప్ తీసుకొచ్చేందుకు కొత్త ప్లాన్
ఇదిలా ఉండగా అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేయాలని మేకర్స్(Makers)చూస్తున్నారు. రోజుల వ్యవధిలోనే పుష్ప2పై అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ నవంబర్ 17న ట్రైలర్(Trailer)ను రిలీజ్ చేయబోతున్నారు. చాలా గ్రాండ్‌గా ఈ ఈవెంట్ జరగబోతుందట. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకుంటాయని మేకర్స్ భావిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇంత పీక్ మూమెంట్‌లో ఇప్పుడు పుష్ప మూవీని రీరిలీజ్(Re release) చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. అది కూడా ఇక్కడ కాదు USAలో. పుష్ప 2కి మరింత హైప్ తీసుకురావడానికి ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మేకర్స్.
* అక్కడ మార్కెట్ పెంచుకోవడనికే..
పుష్ప 2కి భారీ హైప్ ఉంది కాబట్టి.. కచ్చితంగా ఆడియన్స్ మరోసారి పుష్ప సినిమా చూడడానికి వస్తారని అనుకుంటున్నారు. ఈ రీరిలీజ్ వలన పుష్ప- 2 కి పెద్ద అడ్వాంటేజ్ కూడా ఉంది. ఎందుకంటే నిజానికి అల్లు అర్జున్‌కి USలో అంత మార్కెట్ లేదు. అయినా సరే పుష్ప పార్ట్ 1 అక్కడ మంచి వసూళ్ల(Collections)ను రాబట్టింది. అందుకే ఈసారి ఏకంగా 20+ మిలియన్ డాలర్స్ టార్గెట్‌తో బరిలోకి దిగుతుంది. అందుకే పుష్ప పార్ట్ 1 November 19న రీరిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా రీరిలీజ్ అయ్యే అన్ని థియేటర్స్‌లో పుష్ప 2 ట్రైలర్‌ను ప్రదర్శించనున్నట్లు సమాచారం. సో ఇదంటీ పుష్పరాజ్ ప్లాన్..






