Karthika Pournami 2024: కార్తీక పౌర్ణమి స్పెషల్.. 365 వత్తులు ఎందుకు వెలిగిస్తారంటే!

Mana Enadu: కార్తీక మాసం(Kathika Masam) హిందువులకు అత్యంత ఆధ్యాత్మిక మాసం. ఈనెలలో వచ్చే కార్తీక పౌర్ణమి(Karthika Pournami) వారికి ఎంతో ప్రత్యేకమైన రోజు. ఆ రోజున ప్రతి ఇల్లూ దీపాలతో ప్రకాశిస్తుంటుంది. అంతేకాదు ఈ నెలలో ప్రతి రోజూ పవిత్రమైనదే. నదీ స్నానాలు(River baths), దానధర్మాలు(charity), పూజలు అన్నీ శుభాలను ఇస్తాయని హిందూ భక్తుల నమ్మకం. అయితే కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిధులు అత్యంత విశిష్టమైనవి,పవిత్రమైనవి. హిందువులు(Hindus) కార్తీక మాసంలోని పౌర్ణమి రోజున శివుడి(Lord Shiva)ని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు.

 నదీ స్నానానికి ఎంతో విశిష్టత

కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున(Early Monrning) అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవాలి. తలంటు స్నానం ఆచరించాలి. వీలైతే నదీ స్నానం చేస్తే మంచిది. ఎందుకంటే కార్తీకమాసంలో విష్ణు భగవానుడు చేప రూపంలో నీటిలో నివసిస్తాడు. అందుకే ఈ సమయంలో నదీ స్నానానికి(River baths) ఎంతో విశిష్టత ఉందని పురాణాలు చెబుతున్నాయి. స్నానం తరువాత ఇంట్లో దీపారాధన చేయాలి. అనంతరం దగ్గర్లోని శివాలయానికి వెల్లి రుద్రాభిషేకం(Rudraabhishekam) చేయాలి. ఆ రోజంతా ఆ పరమశివుడినే స్మరిస్తూ ఉపవాస(Fasting) దీక్ష చేస్తే మంచి జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.


 తులసి చెట్టు దగ్గరా వెలిగించొచ్చు..

ముఖ్యంగా, కార్తీక పౌర్ణమి రోజున చాలామంది 365 వత్తులతో దీపం(Lamp with 365 wicks) వెలిగించడం ఒక ఆచారంగా పాటిస్తారు. ఇది సంవత్సరంలో ప్రతి రోజు ఒక దీపం వెలిగించలేని వారు ఒక్క రోజు 365 వత్తులతో దీపం వెలిగించడం ద్వారా ప్రతిరోజు దీపారాధన చేసినట్టు భావిస్తారు. ఈ దీపం ఉదయం శివాలయం(Shivalayam)లో వెలిగించవచ్చు లేదా సాయంత్రం ఇంట్లోని తులసి(Tulasi)కోట వద్ద వెలిగించవచ్చు. ఇంత విశిష్టమైన కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ 365 వత్తులతో దీపాన్ని వెలిగించి సుఖ సంతోషాలతో ఉంటారని భక్తుల నమ్మకం. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఇలానే పాటించండి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *