Mana Enadu: విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ సూర్య(Suriya). ఈ స్టార్ హీరో హిట్, ఫట్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు. డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్(Special Fanbase)ను సంపాదించుకున్నాడు ఈ తమిళ స్టార్. తాజాగా అదే స్టైల్లో మరో డిఫరెంట్ మూవీ ‘కంగువా(Kanguva)’తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేశాడు. ఎన్నో అంచనాల నడుమ, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కంగువాను సూర్య ఎంతో ఛాలెంజింగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగు, తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఇవాళ (నవంబర్ 14) విడుదల చేశారు.
భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన కంగువా మూవీ.. సూర్య కెరీర్‌లో తొలి పాన్ ఇండియా(Pan India) చిత్రం. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ నెలకొంది. ఈ మూవీని సిరుత్తై శివ(Shiva) డైరెక్ట్ చేయగా.. స్టూడియో గ్రీన్ కేఈ జ్ఞానవేల్ రాజా, యువీ క్రియేషన్స్(KE Gnanavel Raja, UV Creations) సంయుక్తంగా నిర్మించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్స్ బాబీ డియోల్(Bobby Deol), దిశా పటానీ(Disha Patani) ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగువా.. ఫ్యాన్స్‌ను ఏమేరకు ఆకట్టుకుంది? సూర్య కష్టానికి ఎలాంటి ఫలితం లభించిందా?లేదా? ఈ రివ్యూలో మీకోసం..
కంగువా కథ ఇదే..
ప్రాన్సిస్ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్(Bounty Hunter)గా పనిచేస్తాడు. తన గర్ల్‌ఫ్రెండ్ దిశాపటానీ, యోగి బాబు అతడికి హెల్ప్ చేస్తుంటారు. అనుకోకుండా ఫ్రాన్సిస్(Francis)కి ఓ పాప కలుస్తుంది. ఆమెకి తనకి ఏదో రిలేషన్ ఉందని అతడికి అనిపిస్తుంది. అయితే ఆ బంధం ఇప్పటిది కాదని, గత జన్మదని ఫ్రాన్సిస్ తెలుసుకుంటాడు. దీంతో కథ 1000 ఏళ్ల వెనక్కి వెళ్తుంది. అక్కడ కొన్ని తెగలు, వారి మధ్య యుద్ధాలు.. తెగ నాయకుడిగా ‘కంగువా’ చేసే పోరాటాలు అద్భుతంగా ఉన్నాయి.
సోషియో ఫాంటసీ నేపథ్యంలో..
అయితే సోషియో ఫాంటసీ(Socio fantasy) మూవీకి స్క్రిప్ట్ రాయడం అంత ఈజీకాదు. ఎలాగైనా రాసుకోవచ్చు. కానీ తెరమీద చూపించడం చాలా కష్టం. కంగువా విషయంలోనూ అదే జరిగింది. స్టోరీ, కథనం, మేకింగ్ అంతా బాగానే ఉన్నా సీన్లు ఆడియన్స్‌కు కనెక్ట్ కావు. హీరో విషయంలో డైరెక్టర్ పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. అయితే కంగువా పాత్రలో సూర్య యాక్టింగ్ సూపర్. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్(Graphics) అయితే టాప్ క్లాస్‌గా ఉన్నాయి. అయితే ఎమోషన్స్, సూర్య, దిశా మధ్య లవ్ ట్రాక్ తప్పినట్లు ఉంది. యోగిబాబు కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడం, ఫస్టాఫ్ మరీ యావరేజ్‌గా అనిపిస్తుంది. ఇంత భారీ బడ్జెట్ మూవీని ఇంకాస్త శ్రద్ధతో తీస్తే బాగుండు అనిపిస్తుంది. మొత్తంగా సూర్య స్టార్ ఇమేజ్ మాత్రమే కంగువాను కాపాడాలి. మొత్తంగా సూర్య పర్ఫామెన్స్, DSP మ్యూజిక్, గ్రాఫిక్స్ తప్ప మిగతాదంతా యావరేజ్ బొమ్మే!
Rating: 2.25/5
https://twitter.com/Sharmila__12/status/1856704201637659070






