జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir)లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల(Heavy Rains) కారణంగా అమర్‌నాథ్ యాత్ర(Amarnath Yatra-2025)ను ఈరోజు (గురువారం) నిలిపివేసినట్లు జమ్మూ కశ్మీర్ సమాచార శాఖ(J&K Information Department) ప్రకటించింది. పహల్గామ్(Pahalgham), బాల్తాల్ బేస్ క్యాంపు(Baltal Base Camp)ల నుంచి యాత్రికులను అనుమతించకపోవడంతో యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. భారీ వర్షాలు, కొండచరియల(Landslides) విరిగిపడటం వల్ల యాత్రా మార్గాలు దెబ్బతిన్నాయి. బాల్తాల్ మార్గంలో భూస్ఖలనం కారణంగా ఒకరు మరణించగా, 10 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అధికారులు యాత్రా మార్గాలపై అత్యవసర మరమ్మతు పనులు చేపడుతున్నారు.
42,000 మంది జవాన్లతో భారీ భద్రత
కాగా దీనిపై స్పందించిన కశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధూరి, వాతావరణ పరిస్థితులు(weather conditions) మెరుగైన వెంటనే యాత్రను పునఃప్రారంభిస్తామని తెలిపారు. జమ్మూ బేస్ క్యాంప్ నుంచి కొత్త బ్యాచ్ యాత్రికులను ప్రస్తుతం అనుమతించడం లేదని చెప్పారు. కాగా ఈ ఏడాది జులై 3న ప్రారంభమైన ఈ యాత్రలో ఇప్పటివరకు 2.35 లక్షలకు పైగా భక్తులు పవిత్ర అమర్‌నాథ్ గుహను సందర్శించారు. ఈ యాత్రకు భద్రత కోసం కేంద్రం 42,000 మంది జవాన్లతో భద్రత పెంచింది. ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి(Terror Attack) నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. వాతావరణ శాఖ సోమవారం (జులై 21) నుంచి వర్షాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. యాత్రికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Heavy Mud sliding near Railpathri in Baltal during ongoing Amarnath Yatra.
Amarnath Yatra suspended for a day from Pahalgam and Baltal Due To Continous Heavy Rainfall#JammuKashmir #Shrinagar #landslide #AmarnathYatra2025 #Baltal pic.twitter.com/1OaaW90oLZ
— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) July 17, 2025






