బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 5న జరిగిన IPL విజయోత్సవ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటన(Stampade Incident)లో 11 మంది మరణించిన సంఘటన దేశవ్యాప్తంగా షాక్‌కు గురిచేసింది. కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) ఈ ఘటనకు సంబంధించి విచారణ నిర్వహించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA)లను బాధ్యులుగా నిర్ధారించింది. హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పోలీసుల అనుమతి లేకుండా ఆర్సీబీ ప్రజలను ఆహ్వానించడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని ఆరోపించింది.
కోహ్లీ వీడియో పోస్ట్ కూడా ఓ కారణమే..!
నివేదిక ప్రకారం.. RCB జూన్ 4 ఉదయం 7:01 గంటలకు సోషల్ మీడియా(SM)లో ఉచిత ప్రవేశంతో విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు జరిగే విజయోత్సవ పరేడ్(Victory parade)లో పాల్గొనాలంటూ పోస్ట్ చేసింది. ఉదయం 8:55 గంటలకు RCB అధికారిక ఖాతాలో విరాట్ కోహ్లీ(Virat Kohli) వీడియో కూడా పోస్ట్ అయింది. ఇందులో ఆయన బెంగళూరు ప్రజలతో కలిసి విజయాన్ని జరుపుకోవాలని అభిమానులను ఆహ్వానించాడు. ఈ పోస్ట్‌లను 44 లక్షల మంది వీక్షించారు. దీంతో 2-3 లక్షల మంది అభిమానులు స్టేడియం వద్ద గుమిగూడారు. స్టేడియం సామర్థ్యం కేవలం 35,000 మాత్రమే కావడంతో, గేట్ నంబర్లు 1, 2, 21 వద్ద అభిమానులు గేట్లను బద్దలు కొట్టడం వల్ల తొక్కిసలాట జరిగింది.
కొనసాగుతున్న జ్యుడీషియల్ దర్యాప్తు
స్టేడియం సమీపంలోని ఒక డ్రైన్‌పై ఉంచిన తాత్కాలిక స్లాబ్ జనం బరువుకు తాళలేక కూలిపోవడం కూడా ఈ ఘటనకు కారణమైందని నివేదిక తెలిపింది. ఆర్సీబీ, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ), ఈవెంట్ నిర్వాహకులైన డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు గేట్ నిర్వహణ, అభిమానుల నియంత్రణలో విఫలమైనట్టు నివేదిక పేర్కొంది. కాగా ఈ ఘటనపై జ్యుడీషియల్ దర్యాప్తుకు ఆదేశించగా, బెంగళూరు పోలీస్ కమిషనర్ బి. దయానంద సహా పలువురు అధికారులను సస్పెండ్ అయ్యారు.
लाइसेंस भी नहीं था, ना ही इजाजत ली थी… बेंगलुरु भगदड़ की रिपोर्ट आई सामने, RCB को ठहराया गया दोषी https://t.co/rfGJkTkQTB
— RN yadav🇮🇳 (@RamnareshY21480) July 17, 2025






