హాట్‌స్టార్‌ బాటలో అమెజాన్.. ఇకపై ప్రైమ్​ వీడియోలో ‘యాడ్స్’

Mana Enadu : ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో(Amazon Prime Video) తన యూజర్లకు షాక్ ఇచ్చింది. ఆదాయాన్ని మరింత పెంచుకొనేందుకు సరికొత్త ఉపాయాన్ని ఆలోచించింది. ఇప్పటివరకు ఎలాంటి యాడ్స్ లేకుండా నిరంతరాయంగా ఎంటర్టైన్ చేసిన ఈ ప్లాట్ ఫామ్.. త్వరలోనే యాడ్స్ జోడించాలనే యోచన చేస్తోంది. ఈ విషయాన్ని అమెజాన్‌ అధికారికంగా వెల్లడించింది.

యాడ్‌- ఫ్రీ కంటెట్‌ (Prime Video Ad Free Content) కావాలనుకొనేవారు అధిక ధరతో తీసుకొచ్చే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ఎంచుకోవాల్సి ఉంటుందని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రకటించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికో, బ్రిటన్‌, అమెరికాతో పాటు పలు యూరోపియన్‌ దేశాల్లోని యూజర్లకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో యాడ్స్‌ను జోడించింది. ఈ క్రమంలోనే ఇండియాలోనూ వచ్చే ఏడాది నాటికి ఈ ప్రకటనలు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. 

యూజర్లు ప్రైమ్‌ వీడియో ప్లాట్​ఫామ్​లో యాడ్స్ వద్దనుకుంటే యాడ్‌-ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌(Ad Free Subscription)ను తీసుకోవాల్సి ఉంటుంది. పోటీ అధికంగా ఉన్న ఇండియా లాంటి మార్కెట్లలో కంటెంట్ కోసం పెట్టుబడులు అవసరమని భావిస్తున్న సంస్థ.. నిధులు సమకూర్చుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఇతర స్ట్రీమింగ్ ప్లాట్​ఫామ్​లు, టీవీల కంటే తక్కువ యాడ్స్‌ తక్కువగానే ప్రసారం అవుతాయని పేర్కొంది. 

అయితే ప్రైమ్​ వీడియో ప్లాట్​ఫామ్​లో వచ్చిన ఈ కొత్త మార్పు అమెజాన్‌ ప్రైమ్‌లైట్‌(Amazon Prime Lite) మెంబర్లపై ఎటువంటి ప్రభావం చూపదని సంస్థ తెలిపింది. ఎందుకంటే అందులో ఇప్పటికే యాడ్స్‌ వస్తున్నాయని చెప్పింది. ఇండియాలో డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney + Hotstar) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు యాడ్‌ ఫ్రీ ప్లాన్‌లు చాలా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే.

Share post:

లేటెస్ట్