తాను ఉన్నత స్థితిలో నిలవాడనికి స్ఫూర్తినింపిన ప్రముఖ సినీ నటులపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రశంసలు కురిపించారు. ముంబై వేదికగా జరుగుతున్న వేవ్స్ సమ్మిట్(World Audio Visual Entertainment Summit)లో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సినీ జీవితం, ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాలు, స్ఫూర్తి పొందిన నటీనటుల గురించి చిరు ప్రస్తావించారు. ‘‘బాల్యంలో నేను డ్యాన్స్ చేసి కుటుంబం, స్నేహితులను అలరించేవాడిని. అలా నటనపై మొదలైన ఆసక్తి నన్ను చెన్నై వెళ్లేలా చేసింది. నేను అడుగుపెట్టే సమయానికి ఇండస్ట్రీలో ఎంతోమంది లెజండరీ యాక్టర్స్(Legendary Actors) ఉన్నారు’’ అని చిరు గుర్తు చేసుకున్నారు.
. @ikamalhaasan Was My Inspiration For Dance,” Says Megastar @KChiruTweets garu At @WAVESummitIndia #Chiranjeevi #KamalHaasan𓃵 #WAVESummit #WAVES2025 #WAVES #WAVESummitIndia #WAVESSUMMIT2025 pic.twitter.com/7RSlgxJZ2u
— Beyond Media (@beyondmediapres) May 1, 2025
ఇంకా ఏమన్నారంటే ‘ఇప్పటికే పలువురు సూపర్‌స్టార్స్ ఉన్నారు కదా. ఇంకా అదనంగా నేనేం చేయగలను?అని అనుకునేవాడిని. ఎలాగైనా అందరి దృష్టిని ఆకర్షించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నా. 1977లో నటనలో శిక్షణ పొందా. మేకప్ లేకుండా సహజంగా నటించాలని మిథున్ చక్రవర్తి నుంచి నేర్చుకున్నా. స్టంట్స్ విషయంలో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), డ్యాన్స్ విషయంలో నా సీనియర్ కమల్ హాసన్(Kamal Hasan) నాకు స్ఫూర్తిగా నిలిచారు. వారి సినిమాలు చూస్తూ, నటన పరిశీలిస్తూ నన్ను నేను మలుచుకున్నా’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, ఆమిర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.






