
ముంబై(Mumbai) వేదికగా ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (Waves Summit 2025) అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భారతీయ వినోద పరిశ్రమ ప్రతిష్ఠను ప్రపంచానికి చాటాలన్న లక్ష్యంతో భారత ప్రభుత్వం(Indian Govt) ఈ సదస్సును నిర్వహిస్తోంది. ‘కనెక్టింగ్ క్రియేటర్స్.. కనెక్టింగ్ కంట్రీస్’ అనే నినాదంతో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్(Jio World Convention Center)లో ఈ కార్యక్రమం నాలుగు రోజుల పాటు జరగనుంది. కాగా ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ముఖ్య అతిథిగా పాల్గొని భారతీయ చలన చిత్ర పరిశ్రమను ఉద్దేశించి ప్రసంగించారు.
Mumbai, Maharashtra: At the WAVES Summit, PM Narendra Modi says, “We are creating an environment where your ideas and imagination are valued, where new dreams are born and you are empowered to realize those dreams. Through the WAVES Summit, you’ll also get a major platform, one… pic.twitter.com/AP8m3M9EER
— IANS (@ians_india) May 1, 2025
ఈ ప్రారంభ వేడుకలకు ఇండియన్ సినీ ఇండస్ట్రీకి చెందిన దిగ్గజాలు, ప్రముఖ తారలు హాజరై సందడి చేశారు. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), మోహన్ లాల్, రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె, ప్రియాంకా చోప్రా(Priyanka Chopra), సత్యజిత్ రే, రాజ్ కపూర్, రాజమౌళి, AR రెహమాన్, ఆమిర్‌ఖాన్ వంటి అనేక మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్పెషల్ ఎట్రాక్షన్‌గా చైతూ-శోభిత
ఇక టాలీవుడ్(Tollywood) నుంచి యువ నటుడు నాగచైతన్య(Nagachaitanya), నటి శోభిత ధూళిపాళ(Shobhita Dhulipala) దంపతులు ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. నాగచైతన్య బ్లాక్ సూట్‌లో స్టైలిష్‌గా కనిపించగా, శోభిత సంప్రదాయ చీరకట్టులో నుదుటన బొట్టుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరి తాజా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్నాయి.
#NagaChaitanya attends #WavesSummit2025 with the stunning #SobhitaDhulipala by his side ♥️ Aren’t they absolutely adorable together? pic.twitter.com/9jEH2UUhfd
— Pinkvilla South (@PinkvillaSouth) May 1, 2025