ప్రతి మహిళ లైఫ్ లో తల్లి కావడం అనేది ఓ మధురానుభూతి. చాలా మంది మాతృత్వంతోనే తమ జీవితం పరిపూర్ణమైందని భావిస్తుంటారు. అలాంటి మదర్ హుడ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. తొమ్మిది నెలల పాటు పసికందును తమ కడుపులో మోస్తారు. ఆ క్రమంలో ప్రతి రోజును ఓ అనుభూతిలా ఫీలవుతుంటారు. అందుకే చాలా మంది ప్రెగ్నెన్సీ సమయంలో బేబీ బంప్ (Baby Bump)తో మ్యాటర్నెటీ ఫొటోషూట్ చేసుకుంటుంటారు.
హీరోయిన్ పోస్టుపై విమర్శలు
ఇప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో ఫొటోషూట్ (Maternity Photoshoot) ఓ ట్రెండ్ అయిపోయింది. ఇక సెలబ్రిటీలయితే ఈ ట్రెండ్ ను ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి.. అర్ధనగ్నంగా.. రకరకాలుగా ఫొటోషూట్ లు చేస్తున్నారు. చాలాసార్లు వాటిపై నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అయిన సందర్భాలున్నాయి. తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది ఓ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరంటే..?
బేబీ బంప్ తో న్యూడ్ ఫొటో
నటి అమీ జాక్సన్ (Amy Jackson) రెండోసారి తల్లి కాబోతోంది. ఇటీవలే ఈ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో బేబీ బంప్ ఫొటోలు పోస్టు చేసింది. స్విమ్మింగ్ పూల్ ముందు ఒంటిపై బట్టలు లేకుండా.. నగ్నంగా బేబీ బంప్ తో ఫొటో దిగింది. ఈ ఫొటోను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
View this post on Instagram
నెటిజన్లు ఫైర్
పవిత్రమైన మాతృత్వాన్ని ఇలాంటి వల్గర్ (Amy Jackson Baby Bump) ఫొటోషూట్లతో అప్రతిష్టపాలు చేస్తున్నారంటూ కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలా కాకుండా మామూలుగా కూడా ప్రెగ్నెన్సీ అనుభూతులు షేర్ చేసుకోవచ్చని విమర్శిస్తున్నారు. మొత్తానికి అమీ జాక్సన్ లేటెస్ట్ పోస్టు నెట్టింట ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎవడు సినిమాతో ఈ భామ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రోబో 2.0, ఐ, నవమన్మథుడు, పోలీసోడు సినిమాలతో అలరించింది.







