Mana Enadu : ఇండియా ఓటీటీ రంగంలో పెను సంచలనం మీర్జాపూర్ (mirzapur) వెబ్ సిరీస్. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో దొంగల ముఠాలు, రౌడీమూకలు అల్లర్లు, రౌడీ షీటర్ల గ్యాంగులు, వారి పెత్తనం, నకిలీ తుపాకుల తయారీ, అమ్మకం ఇలా ఎన్నో ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు అన్ని మీర్జాపూర్ సిరీస్ లో కనిపిస్తాయి. చిన్న వయసులోనే మీర్జాపూర్ పీఠం ఎక్కాలనుకున్న మున్నా త్రిపాఠి, గుడ్డు భయ్యా మధ్య జరిగే పోరాటాలు మీర్జాపూర్ 1, 2 సిరీస్ లలో అద్భుతంగా చూపించారు.
ఓటీటీలో (ott) వెబ్ సిరీస్ లు ఎవరూ చూస్తారా అనే బదులు ఇలాంటి వెబ్ సిరీస్ లు చూడాలి అనే విధంగా దీన్ని తెరకెక్కించారు. అప్పటి వరకు మూస దోరణిలో సాగిపోయిన సినిమాలను చూసి ఒక్కసారిగా రియల్ స్టోరీ లాంటి మాఫియా బ్యాగ్రౌండ్ ఉన్న వెబ్ సిరీస్ వచ్చే సరికి పాన్ ఇండియా లెవల్లో మీర్జాపూర్ భారీ హిట్ సాధించింది. కాగా మీర్జాపూర్ 2 సిరీస్ లో మెయిన్ విలన్ మున్నా త్రిపాఠి (munna tripati) చనిపోవడం వల్ల మూడో సిరీస్ లో కాస్త కిక్ తగ్గినట్లు అనిపించింది.
ఇంగ్లిష్ వెబ్ సిరీస్ పీకీ బ్లైండర్ తరహాలో
మీర్జాపూర్ ది ఫిల్మ్’ (Mirzapur The Film) ఇంగ్లిష్ వెబ్ సిరీస్ ‘పీకీ బ్లైండర్’ తరహాలో ఉండే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. సిరీస్ రెండో పార్టులో చనిపోయిన వారు అందరూ మళ్లీ సినిమాలో లేచి వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇదే గనక జరిగితే ఈ వెబ్ సిరీస్ మళ్లీ మామూలు స్థాయికి రీచ్ అయిపోదు. చనిపోయిన వారు తెరపై కనిపిస్తారు. సిరీస్ లకు ప్రీక్వెల్ గా సినిమా ఉంటుంది అని మెల్లిగా ఫిల్మ్ మేకర్స్ హింట్స్ ఇస్తున్నారు. మీర్జాపూర్ సిరీస్ లో అలీ ఫజల్ (fazal ali) గుడ్డూ భయ్యాగా కనిపించి చాలా మందికి అభిమాన నటుడిగా మారిపోయారు.
సినిమాగా రాబోతున్న మీర్జాపూర్
క్రైమ్, థ్రిల్లర్ యాక్షన్ నేపథ్యంలో తీసిన ఈ సినిమాకు దర్శకత్వం గుర్మీత్ సింగ్ వహించారు. తొలి సీజన్ 2018 నవంబరు 16న విడుదలైంది. పంకజ్ త్రిపాఠి (pankaj tripati), శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్రియ పిల్గోంగర్, హర్షిత గౌర్ నటించగా.. వీరందరూ పాన్ ఇండియా లెవల్లో పేమస్ అయిపోయారు.
దానికి సీక్వెల్గా 2020 అక్టోబరు 23న రెండో సీజన్ విడుదలైంది. ఈ సీజన్ కూడా ప్రేక్షకులకు పిచ్చెక్కించింది. మూడో సీజన్ జులై 5 2024 లో రాగా.. ప్రస్తుతం దీని గురించి ఫజల్ అలీ ఇచ్చిన అప్ డేట్ తో ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతున్నారు. దీన్ని సినిమా రూపంలో కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.






