ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) ఫైనల్‌లో టీమ్ఇండియా(Team India)తో పోటీపడే ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. లాహోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కివీస్ 50 రన్స్ తేడాతో సౌతాఫ్రికా(South Africa)ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకొచ్చింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్(New Zealand).. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 భారీ స్కోరు సాధించింది. ఆ జట్టులో ఇద్దరు బ్యాటర్లు రచిన్ రవీంద్ర (108), సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (102) సెంచరీలతో చెలరేగారు.
ఛేజింగ్‌లో ఆ ఇద్దరే..
అనంతరం భారీ టార్గెట్ ఛేదనలో సఫారీలు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 312/9కే పరిమితమయ్యారు. ఆ జట్టులో మిల్లర్ (100), బవుమా (56) రన్స్ చేసినా ఆ జట్టును కాపాడలేకపోయారు. కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (3/43) సఫారీలను కట్టడి చేశాడు. సెంచరీతో చెలరేగిన రచిన్(Rachin Ravindra)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. దీంతో ఈనెల 9న దుబాయ్(Dubai) వేదికగా జరుగనున్న ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్(IND va NZ) అమీతుమీ తేల్చుకోనున్నాయి.

నాకౌట్ పోరులో కివీస్‌దే పైచేయి
కాగా తొలి సెమీస్‌లో టీమ్‌ఇండియా.. ఆస్ట్రేలియా(AUS)ను ఓడించగా రెండో సెమీస్‌లో కివీస్.. సౌతాఫ్రికా(SA)ను చిత్తుచేసింది. ఈ రెండు జట్లూ ఛాంపియన్స్ ట్రోఫీ-2000లో తుదిపోరులో తలపడగా అందులో కివీస్‌దే పైచేయి అయింది. 2021 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC-2021) ఫైనల్‌లోనూ భారత్‌కు పరాభవం తప్పలేదు. 2019 వన్డే ప్రపంచకప్(WC 2019)లో సెమీస్ పోరు సందర్భంగా ధోనీ రనౌట్ ఇప్పటికీ భారత అభిమానులకు మరిచిపోలేని పీడకలే. మరి దుబాయ్‌లో అదృష్టం ఎవరిని వరింస్తుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.






