
ఒకప్పుడు యాంకరింగ్ ద్వారా తనదైన గుర్తింపు సంపాదించుకున్నఅనసూయ(Anasuya Bharadwaj).. ఇప్పుడు వెండితెరపై తన టాలెంట్‌తో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ‘జబర్దస్త్’ షోతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న అనసూయ, టీవీ యాంకరింగ్‌కు గుడ్‌బై చెప్పి, సినిమాలతో ఫుల్ బిజీగా మారింది.
తాజాగా విడుదలైన అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమాలో కీలక పాత్రలో కనిపించిన అనసూయ, అందులో తన పాత్రతో మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా విజయం అనంతరం ఆమెకు వచ్చే అవకాశాలు మరింతగా పెరిగాయి. తెలుగు సినిమాలతో పాటు తమిళ, మలయాళ భాషలలోనూ ఆమె ప్రాజెక్టులను ఒప్పుకుంటూ, తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంది.
సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్
అనసూయ ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోషూట్లను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. హాట్ లుక్స్‌లో కనిపిస్తూ ట్రోలర్లకు స్ట్రాంగ్ రిప్లైలు ఇస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఏ పోస్ట్ పెట్టినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అనసూయ.
వైరల్ అవుతున్న వ్యక్తిగత విషయాలు
ఇటీవల అనసూయ గురించి ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఏంటంటే.. ఆమె భర్త ఎవరనే ప్రశ్న. ఫ్యాన్స్ గూగుల్‌లో అనసూయ భర్త గురించి సెర్చ్ చేస్తూ ఉంటారట. నిజానికి అనసూయ 14 ఏళ్ల క్రితమే సుశాంక్ భరద్వాజ్(Shushank Bharadwaj) అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. కళాశాల రోజుల్లో ఎన్‌సీసీలో ఉన్నప్పుడు సుశాంక్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది. ప్రస్తుతం సుశాంక్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానర్‌గా పని చేస్తున్నాడు. అనసూయ, భర్తతో కలిసి తరచూ ట్రిప్‌లకు వెళ్లి మధుర క్షణాలను ఆస్వాదిస్తూ ఉంటారు.
నటిగా అనసూయ ఎదుగుదల
నటిగా అనసూయ ప్రయాణం కూడా ఆసక్తికరంగానే సాగింది. తొలి దశలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన “నాగ” సినిమాలో ఆమె చిన్న పాత్రలో నటించింది. తర్వాత న్యూస్ ప్రెజెంటర్‌గా పని చేసి, ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గా దూసుకెళ్లింది. అనేక షోలకు యాంకరింగ్ చేసినప్పటికీ, “జబర్దస్త్” షో ద్వారా ఆమెకు గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన “రంగస్థలం” సినిమాలో రంగమ్మత్తగా ఆమె నటన ప్రేక్షకులను మెప్పించింది. ఆ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలవడంతో అనసూయకు నటిగా మరిన్ని అవకాశాలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్”లో జర్నలిస్ట్ పాత్రలో నటించి తన ప్రొఫెషనల్ వైవిధ్యాన్ని మరోసారి నిరూపించుకుంది.