హైదరాబాద్‌లో లగ్జరీ ఇల్లు కొన్న అనసూయ.. రేటు ఎంతో తెలిస్తే బుర్ర వేడెక్కిపోవాల్సిందే!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరమే లేదు. బుల్లితెర నుంచి వెండితెర వరకు అనసూయ క్రేజ్ వేరే లెవెల్ అంతే. యాంకరింగ్ చేయడంలో కొత్త కోణం ఆవిష్కరించిన అనసూయ, సినిమాల పరంగా కూడా డుకుపోతూ బాగా సంపాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఓ లగ్జరీ ఇల్లు కొనేసింది అనసూయ. ఇందుకు సంబంధించిన ఫొటోస్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరి చూపు ఈ ఇల్లుపై పడింది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

హైదరాబాద్‌లో అల్ట్రా లగ్జరీ హౌస్

అనసూయ కొత్తగా కొన్న ఈ ఇల్లు అల్ట్రా లగ్జరీగా ఉందని తెలుస్తోంది. సకల సౌకర్యాలతో పాటు 4 బెడ్ రూమ్స్ ఉన్నాయని సమాచారం. పెద్ద హాల్, డ్రాయింగ్ రూమ్, మినీ థియేటర్ రూమ్ తో పాటు కళ్ళు చెదిరే సదుపాయాలతో ఈ ఇల్లు డిజైన్ చేశారని తెలుస్తోంది. అనసూయ స్వయంగా తన టెస్ట్ కి తగ్గట్టుగా ఈ ఇల్లు ప్లాన్ చేసుకుందట.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

కొత్త ఇంటి పేరు

రీసెంట్ గానే కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన అనసూయ.. ఇందుకు సంబంధించిన చాలా ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కుటుంబంతో కలిసి హోమాలు, పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నట్లు చెప్పింది. అలాగే తమ ఇంటికి ‘శ్రీరామ సంజీవని’ అనే పేరు పెట్టుకున్నామని కూడా వెల్లడించింది అనసూయ.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

ఇల్లు ధర ఎంతో తెలుసా?

అనసూయ కొత్త ఇల్లు ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుండటంతో ప్రతిఒక్కరి చూపు ఈ ఇప్పు ధర ఎంత అయి ఉంటుందనే దానిపై పడింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ ఇల్లు కోసమా అనసూయ ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు చేసిందట. లగ్జరీ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా అన్ని సదుపాయాలతో డిజైన్ చేయించుకుందట. ఏదేమైనా సినిమాల్లో అయినా, రియల్ లైఫ్ లో అయినా అనసూయ రేంజే వేరులే అంటున్నారు ఈ ఇల్లు చూసిన నెటిజన్లు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *