ప్రముఖ నటి, స్టార్ యాంకర్ ఝాన్సీ(Star Anchor Jhansi) అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అటు బుల్లితెరతో పాటు ఇటు వెండితెర(Silver Screen)పై కూడా ఝాన్సీ తనదైన ముద్ర వేశారు. 90వ దశకంలో ప్రారంభమైన ఆమె సినీ ప్రయాణం ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రొఫెషన్ గురించి పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్(Personal life)లోనూ ఝాన్సీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. సినీ నటుడు జోగి నాయుడు(Movie actor Jogi Naidu)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఝాన్సీ.. ఏడాది కూడా అతనితో కలిసి ఉండలేక పోయింది.
తల్లిబాటలోనే తనయ
అభిప్రాయ భేదాలతో జోగి నాయుడుకు విడాకులు(Divorce) ఇచ్చేసింది. భర్తతో విడిపోయే సమయానికి ఝాన్సీకి ఒక కూతురు ఉంది. ఆమె పేరు ధన్య(Dhanya). ప్రస్తుతం ఆమె కూడా తన తల్లి బాటలోనే సినిమాల్లోకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇక తాజాగా ఝాన్సీ ఫస్ట్ టైమ్ తన కూతురు ధన్యతో కలిసి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ‘కాకమ్మ కథలు(Kakamma Kathalu)’ అనే టాక్ షోకు హాజరైంది. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తేజస్వి మదివాడ(Tejaswi Madiwada) తల్లీకూతుళ్లను తన ప్రశ్నలతో ఓ ఆట ఆడేసుకుంది.
ఆ డైరెక్టర్ సినిమాలో చేయాలని ఉంది
ఇక ఇదే ఈ టాక్ షో(Talk show) వేదికగా ధన్య తన మనసులో కోరికలను బయటపెట్టింది. తన ఏజ్ 22, హైట్ 5’9 అని తెలిపింది. న్యాచురల్ స్టార్ నాని(Natural Star Nani) తన ఫేవరెట్ హీరో అని, ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం(Director Mani Ratnam) సినిమాలో నటించడం తన డ్రీమ్ అని ధన్య చెప్పుకొచ్చింది. అలాగే తల్లితో తనకున్న అనుబంధం, చిన్నతనం నుంచి తాను పెరిగిన విధానంపై కూడా అనేక విషయాలు పంచుకుంది ధన్య. చూడడానికి ఎంతో క్యూట్‌గా ఉన్న ధన్య అద్భుతమైన డ్యాన్సర్(Dancer) కూడా. దీంతో ఆమె ఫిల్మ్ ఎంట్రీ కోసం ఝాన్సీ ఫ్యాన్స్(Jhansi fans) చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.






