శ్రీశైలం జలాశయాని(Srisailam Reservoir)కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల(Heavy Rains) వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద(flood) నీరు వచ్చి చేరుతోంది. సుంకేసుల(Sunkesula), జూరాల(Jurala) నుంచి 1,72,705 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యామ్(Srisailam Dam) పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80TMCలు కాగా ప్రస్తుతం 193.4TMCల నీరుంది. అటు సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312.05TMCలు కాగా.. 164.1TMCలు ఉన్నాయి. సాగర్‌కు 67,433 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) మంగళవారం శ్రీశైలం పర్యటించనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరతారు. 11 గంటలకు శ్రీశైలం చేరుకుని మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు.

పాతికేళ్లలో ఇదే తొలిసారి..
అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకొని కృష్ణమ్మ(Krishnamma)కు చంద్రబాబు జలహారతి(Jalaharathi) ఇస్తారు. తర్వాత గేట్లు ఎత్తి నాగార్జునసాగర్(Nagarjunasagar)కు నీటి విడుదలను ప్రారంభిస్తారు. అలాగే శ్రీశైలం క్రస్ట్‌గేట్లు ఎత్తి నాగార్జున సాగర్‌కు నీరు విడుదల చేయనున్నారు. జులై తొలివారంలోనే డ్యామ్ గేట్లు ఎత్తడం పాతికేళ్లలో ఇదే తొలిసారి. ఇక, గేట్లు ఎత్తిన అనంతరం ఏపీ సీఎం నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అమరావతికి వెళుతారు. కాగా సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో సున్నిపెంట, శ్రీశైలం, డ్యాం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.







