ManaEnadu: ఏపీ అసెంబ్లీ(Assembly Sessions) సెషన్స్ సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వ్యయసాయరంగానికి సంబంధించి ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Acchennaidu) వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి పద్దును అసెంబ్లీ ప్రవేశపెట్టారు. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.43,402 కోట్లతో అగ్రికల్చర్ బడ్జెట్(Agriculture Budget)ను ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. 62% జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉందని, గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం హయాంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి పెద్దపీట(Great for development) వేస్తున్నట్లు అచ్చెన్న తెలిపారు.
ఆయా రంగాలకు కేటాయింపులు ఇలా..
☛ ఎరువుల సరఫరా రూ.40 కోట్లు.
☛ పొలం పిలుస్తోంది రూ.11.31కోట్లు.
☛ రాయితీ విత్తనాలకు రూ.240 కోట్లు
☛ అన్నదాత సుఖీభవ రూ.4,500 కోట్లు.
☛ భూసార పరీక్షలకు రూ.38.88 కోట్లు.
☛ విత్తనాల పంపిణీ రూ.240 కోట్లు.
☛ ప్రకృతి వ్యవసాయంకు రూ.422.96 కోట్లు.
☛ డిజిటల్ వ్యవసాయంకు రూ.44.77కోట్లు.
☛ వ్యవసాయ శాఖ రూ.8,564.37కోట్లు.
☛ ఉద్యానవన శాఖ రూ.3469.47 కోట్లు.
☛ పట్టు పరిశ్రమ రూ.108.4429 కోట్లు.
☛ వ్యవసాయ మార్కెటింగ్ రూ.314.80 కోట్లు.
☛ సహకార శాఖ రూ.308.26 కోట్లు.
☛ వ్యవసాయ యాంత్రీకరణకు రూ.187.68 కోట్లు.
☛ వడ్డీ లేని రుణాలకు రూ.628కోట్లు.
☛ రైతు సేవా కేంద్రాలకు రూ.26.92కోట్లు.
☛ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ రూ.44.03 కోట్లు.
☛ పంటల బీమా పథకానికి రూ.1,023 కోట్లు.
☛ మత్స్య రంగం అభివృద్ధి కోసం రూ.521.34 కోట్లు.
☛ ఉచిత వ్యవసాయ విద్యుత్ రూ.7241.30 కోట్లు.
☛ ఉపాధి హమీ అనుసంధానం రూ.5,150 కోట్లు.
☛ NG రంగా విశ్వవిద్యాలయంకు రూ.507.038 కోట్లు.
☛ NTR జలసిరి రూ.50కోట్లు.
☛ నీరుపారుదల ప్రాజెక్టుల నిర్వహణ రూ.14,637.03 కోట్లు.
☛ ఉద్యాన విశ్వవిద్యాలయంకు రూ.102.227 కోట్లు.
☛ SV పశు విశ్వవిద్యాలయంకు రూ.171.72 కోట్లు.
☛ మత్స్య విశ్వవిద్యాలయం రూ.38కోట్లు.
☛ పశుసంవర్ధక శాఖ రూ.1,095.71 కోట్లు.
రైతులకు సకాలంలో సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుంది.
రైతులు నేరుగా తమ సమస్యలు, సందేహాలను టోల్ ఫ్రీ నెం. 155251 కు ఫోన్ చేసి పరిష్కారం తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు 9.52 లక్షల కాల్స్ ద్వారా వచ్చిన సందేహాలను నివృత్తి చేయడం జరిగినది#APBudgetSession2024… pic.twitter.com/AX4G2BoeDw
— Kinjarapu Atchannaidu (@katchannaidu) November 11, 2024






