Mana Enadu: ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న ఎన్నికల్లో వైసిపి సర్కారుపై ఈనాడు, ఆంధ్రజ్యోతి అసత్యాలు రాస్తున్నాయని సీనినటుడు పోసాని కృష్ణ మురళి ఫైర్ అయ్యారు. వైసిపి ప్రభుత్వంపై ప్రజలకు వందశాతం నమ్మకం ఉందన్నారు. హైదరాబాద్‌లో శనివారం పోసాని ప్రెస్మీట్లో పవన్ పై సంచలన కామెంట్స్ చేశారు.
టైటిల్ యాక్ట్‌పై కావాలనే ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రతికలు ప్రజలకు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని రామోజీరావు, రాధాకృష్ణలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో మోసగాళ్లును గెలిపించడానికి చేసే ప్రయత్నాలను చేసే కుట్రలు ఏవి అడ్డుకోలేవన్నారు
రైతుల భూముల హక్కులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందనే భయభ్రాంతులకు గురి చేసి అధికారం చెలాయించాలని చేసే ఎత్తుగడలు పనిచేయవని స్పష్టం చేశారు. రైతులను భయబ్రాంతులకు గురిచేస్తూ అసత్య ప్రచారం చేయడం మంచిది కాదన్నారు.
ప్రజల కోసం పనిచేసే నాయకుడు జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఒక్కటై చేసే కుట్రలను ప్రజలు సరైన బుద్ది చెబుతారన్నారు. చంద్రబాబు, జగన్ పరిపాలన మధ్య వ్యత్యాసాలను ప్రజలు గుర్తించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. జగన్ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఇప్పటికే జనం ఛీకొట్టారని మరోసారి ఛీకొడతారన్నారు.
కరోనా కాలం లో సహాయం చేయడానికి ముందుకు రాని బాలకృష్ణ, జయప్రకాష్ నారాయణలకు జగన్‌ని విమర్శలు చేసే అర్హత లేదన్నారు. జగన్ ఒక్కడే ప్రజలకు సువర్ణపాలన అందించే దమ్మున్న నాయకుడు అన్నారు. జగన్ ఓటమి చెందింతే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే పరిస్థితి ఉండదన్నారు.
జగన్ మీటింగ్ పెడితే ప్రజలు ఎంతో నమ్మకంతో స్వచ్ఛందంగా వస్తున్నారన్నారు. నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడిగా సీఎం జగన్ అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై నిలబడాలని సవాల్ చేశారు