మన ఈనాడు:లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీదే విజయం అని చెబుతోంది మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టు డే సర్వే. ఈ సారి అన్ని అడ్వాంటేజీలు చంద్రబాబుకే ఉన్నాయని చెబుతోంది. ఆంధ్రాలోని 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ-17, వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు 8 సీట్లు గెలవనునట్లు అంచనా వేసింది.
AP Mood Of The Nation Survey: ఎన్నికల ముందు ప్రజల మూడ్ ఎలా ఉందో…ఏ పార్టీ గెలుస్తుందో తెలుసుకోవడానికి చేసే సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. ఇండియా టుడే (India Today) దీన్ని నిర్వహిస్తుంది. ఇందులో లోక్ సభ ఎన్నికల్లో ఈ సారి చంద్రబాబు నాయుడు (Chandrababu) గెలుస్తారని ప్రజలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీకి (TDP) 17 స్థానాలు వస్తే…వైసీపీకి కేవలం 8 స్థానాలు మాత్రమే దక్కుతాయని సర్వేలో తేలింది. ప్రజలు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని మూడ్ ఆఫ్ ది నేషన్ ర్వే చెబుతోంది.