Andre Russell: ఇంటర్నేషనల్ క్రికెట్‌కు విండీస్ విధ్వంసక వీరుడు గుడ్ బై

వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్(Andre Russell) అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్(Retirement from international cricket) ప్రకటించాడు. 37 ఏళ్ల రస్సెల్, ఆస్ట్రేలియా(Australia)తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తన స్వదేశం జమైకా(Jamica)లోని సబీనా పార్క్ వేదికగా జరిగే తొలి రెండు మ్యాచ్‌లతో (జులై 20, 22) తన అంతర్జాతీయ కెరీర్‌ను ముగించనున్నాడు. దీంతో 2026 ఫిబ్రవరిలో భారత్, శ్రీలంకలో జరిగే టీ20 వరల్డ్ కప్‌(T20 World Cup 2026)కు రస్సెల్ దూరం కానున్నాడు. ఇది వెస్టిండీస్‌(West Indies)కు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.

West Indies: Andre Russell to retire from international cricket - BBC Sport

టీ20ల్లో రస్సెల్ విధ్వంసం అంతాఇంతా కాదు

కాగా రస్సెల్ 2010లో శ్రీలంక(Srilanka)పై ఒకే ఒక టెస్ట్(Only One Test) మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 56 వన్డేలు, 84 T20లు ఆడాడు. టీ20ల్లో 1,078 పరుగులు, 61 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. 2012, 2016 టీ20 వరల్డ్ కప్ విజయాల్లో రస్సెల్ కీలక పాత్ర పోషించాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్, వేగవంతమైన బౌలింగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి. 2019 తర్వాత అతను కేవలం టీ20 ఫార్మాట్‌లోనే ఆడాడు. “వెస్టిండీస్‌ను సూపర్‌హీరోలా రక్షించాలని, కరీబియన్ యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలవాలని కలలు కన్నాను” అని రస్సెల్ తన రిటైర్మెంట్ ప్రకటనలో పేర్కొన్నాడు.

ప్రొఫెషనల్, ఉద్వేగభరిత క్రీడాకారుడు: కోచ్ డారెన్ సామీ

విండీస్ కోచ్ డారెన్ సామీ(Darren Sammy) అతన్ని “ప్రొఫెషనల్, ఉద్వేగభరిత క్రీడాకారుడు”గా అభివర్ణించాడు. రస్సెల్ తాజాగా అమెరికాలో జరిగిన మేజర్ లీగ్ క్రికెట్‌లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌కు ఆడాడు. అక్కడ 126 పరుగులు, 10 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లోనూ రస్సెల్ అభిమానులను అలరిస్తున్నాడు. కాగా అతని రిటైర్మెంట్‌తో వెస్టిండీస్ జట్టు మరో కీలక ఆటగాడిని కోల్పోయింది. ఇటీవల నికోలస్ పూరన్(Nicholas Pooran) కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.

Andre Russell Announces Retirement From International Cricket

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *