మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కతోన్న విషయం తెలిసిందే. సంక్రాంతి 2026 రిలీజ్ టార్గెట్‌గా ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడుతో సాగుతోంది. ఈ సినిమాలో ఇప్పటికే లేడీ సూపర్‌స్టార్ నయనతార(Nayantara)ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసిన అనిల్ అండ్ టీమ్.. ఆమె పాత్రను కొంచెం కొంచెంగా రివీల్ చేస్తూ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై తాజా న్యూస్ మరింత ఆసక్తి రేపుతోంది.

థియేటర్లు మోతకెక్కడం ఖాయం
చిరు-శ్రీలీల(Sreeleela) కాంబోలో ఓ స్పెషల్ సాంగ్(Special Song) ఉండబోతుందని టీటౌన్ టాక్. ఎనర్జీతో ఉండే శ్రీలీల ఇప్పటికే “గుంటూరు కారం” సినిమాతో యూత్‌లో డ్యాన్సింగ్ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకుంది. అలాంటి ఆమె చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటే అదో ఊపే అంటూ అభిమానులు ఊగిపోతున్నారు. చిరు స్టైల్ బ్రేక్ డ్యాన్స్‌కు శ్రీలీల గ్లామర్, గ్రేస్‌ఫుల్ మూమెంట్స్ తోడైతే, ఆ స్పెషల్ సాంగ్‌కు థియేటర్లు మోతకెక్కుతాయని అంటున్నారు.
ప్రత్యేకంగా స్టెప్పులు డిజైన్
ఈ సాంగ్‌కు మాస్ బీట్స్‌లో స్పెషలిస్టైన భీమ్స్ సిసిరోలియో(Bheem’s Cicerolio) మ్యూజిక్ అందిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి, శ్రీలీల కోసం ప్రత్యేకంగా స్టెప్పులు డిజైన్ చేస్తూ కొరియోగ్రఫీ కూడా గ్రాండ్‌గా ఉండబోతుందట. ఇప్పటికే షూటింగ్‌లో భాగంగా కొన్ని పార్ట్స్ రిహార్సల్స్ జరిగాయని టాక్. ఈ మూవీ చిరంజీవికి పూర్తిగా కొత్తగా ఉండేలా, అనిల్ రావిపూడి ఫ్యామిలీ కథానాయకుడిగా చూపించనున్నారని తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ అనౌన్స్‌మెంట్ మరింత హైప్ పెంచుతోంది.
#Nayanathara Promotional video about #ChiruAnil #Chiru157 pic.twitter.com/yLxbbv7gHx
— ATPBO (@AnantapurBO) May 17, 2025








