
మల్లాపూర్ డివిజన్ బీజేపీ డివిజన్ అధ్యక్షుడిగా గూడూరు శైలేష్‌రెడ్డి ఎన్నిక అయ్యారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ పార్టీని వీడి కమలం పార్టీలో చేరారు. అప్పటి నుంచి కమలం పార్టీలో యాక్టివ్‌గా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. వీటితోపాటు పార్టీ సభ్యత్వాల సైతం ముందువరసలో ఉంచారు.
తొలినుంచి శైలేష్‌రెడ్డి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారినికి కృషి చేస్తున్నారు. అంతేగాకుండా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేశారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.