డైనమిక్ హీరో మంచు విష్ణు(Manchu Vishnu), డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh)కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ కన్నప్ప(Kannappa). మంచు విష్ణు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని చేస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి వెలువడిన పోస్టర్(poster), గ్లింప్స్, శివ శివ శంకర పాటతోపాటు రీసెంటుగా విడుదల చేసిన రెండో టీజర్లు(Teasers) సైతం అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఈ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ వదిలారు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్(Beautiful Melody Song)ను ఇవాళ (మార్చి 10) రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 25న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్(Promotions) ఇప్పటికే జోరుగా కొనసాగుతున్నాయి.
విష్ణు-ప్రీతి ముకుందన్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్
దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో మంచు విష్ణుకు జోడీగా ప్రీతి ముకుందన్(Preethi Mukundan) నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య సాగే ‘ సగమై.. చెరిసగమై’ అంటూ సాగే ఓ బ్యూటీఫుల్ లవ్ సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సాంగ్‌ను రేవంత్(Revanth), సాహితి చాగంటి(Sahithi Chaganti) ఆలపించారు. స్టీఫెన్ దేవస్సీ బాణీ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. శ్రీమణి సాహిత్యం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్ చిత్రీకరించిన తీరు, ఇక ప్రభు దేవా(Prabhu Deva), బృందా కొరియోగ్రఫీ చేసిన విధానం, విష్ణు మంచు-ప్రీతి ముకుందన్‌ను చూపించిన తీరు, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది.
శివుడిగా కనిపించనున్న అక్షయ్ కుమార్
కాగా.. శివ భక్తుడైన కన్నప్ప పురాణ కథను వెండితెరపై ఆవిష్కరించబోతోన్నారు. విష్ణు మంచు కన్నప్పగా, అక్షయ్ కుమార్(Akshay Kumar) శివుడిగా, ప్రభాస్(Prabhas) రుద్రుడిగా, కాజల్ పార్వతీ మాతగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. మోహన్ బాబు, మోహన్‌లాల్, బ్రహ్మానందం వంటి అద్భుతమైన తారాగణంతో తెరకెక్కిన కన్నప్ప చిత్రం వచ్చే నెల చివరి వారంలో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.






