
కిక్రెట్‌లో ఓ మహా సమరం ముగిసింది. 19 రోజుల పాటు అభిమానులను అలరించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) టోర్నమెంట్ మార్చి 9న న్యూజిలాండ్-భారత్(NZ vs IND) మధ్య ఫైనల్‌తో ముగిసింది. తుదిపోరులో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో కివీస్‌ను మట్టికరిపించి 12 తర్వాత మళ్లీ ఈ ట్రోఫీని ముద్దాడింది. ఈ ట్రోఫీకి ఐసీసీ భారీ మొత్తంలో ప్రైజ్ మనీ(Prize Money) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్‌లో గెలిచి ఛాంపియన్స్‌గా నిలిచిన టీమ్ఇండియా ప్లేయర్ల పంట పండింది. ఒక్కో ప్లేయర్‌కు ఎంత దక్కతుంది. టోర్నీలోని మిగతా జట్లకు ఎంతెంత అందుతుందుంది? అనే వివరాలను ఐసీసీ తాజాగా వెల్లడించింది.
ఒక్కో జట్టుకు ఎంత అందుతుందంటే..
ICC ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీని ప్రకటించింది. దానీ ప్రకారం.. విజేత భారత (Winner Team India) జట్టుకు $2.24M, అంటే దాదాపు రూ.19.46 కోట్లు లభించాయి. అంటే భారత జట్టులోని ప్రతి ఆటగాడికి ఒక కోటి రూపాయలకు పైగా లభించింది. అలాగే రన్నరప్ అయిన న్యూజిలాండ్(NZ) $1.12 మిలియన్లు, అంటే దాదాపు రూ.9.73 కోట్లు అందుకుంది. సెమీఫైనల్లో ఓడిపోయిన AUS, SAకు ఒక్కొక్కటి $560,000, అంటే దాదాపు రూ.4.86 కోట్లు అందుకున్నాయి. దీంతోపాటు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లకు రూ.3.04 కోట్ల చొప్పున.. లీగ్ స్టేజీలో టేబుల్ చివరన నిలిచిన PAK, ENG జట్లకు రూ.1.22 కోట్ల చొప్పున దక్కింది. దీంతోపాటు ప్రతి గ్రూప్ దశ మ్యాచ్ విజయానికి ప్రైజ్ మనీ రూ.29.53 లక్షల చొప్పున ఆయా జట్లు అందుకుంటాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అవార్డులు వీరికే..
☛ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: రచిన్ రవీంద్ర (NZ)
☛ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు: రోహిత్ శర్మ(IND)
☛ గోల్డెన్ బాల్ అవార్డు: మ్యాట్ హెన్రీ(NZ)
☛ గోల్డెన్ బ్యాట్ అవార్డు: రచిన్ రవీంద్ర(NZ)