
హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(RGIA) మరో ఘనత సాధించింది. ప్రయాణికుల సేవల(For passenger services)కు సంబంధించి ఈ విమానాశ్రయానికి ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ఎయిర్ పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్‌లో ఎయిర్ పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వే(Airport Service Quality Survey)లో శంషాబాద్ విమానాశ్రయానికి మరోసారి ఈ అవార్డు దక్కింది. 2024 ఏడాదిగానూ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 15-25 మిలియన్ల ప్రయాణికులు తమ రాకపోకలు సాగించేందుకు ఉత్తమ సర్వీసు అందించి “బెస్ట్ ఎయిర్ పోర్టు(Best Airport)అవార్డు”ను అందుకుంది.
అందుకే ది బెస్ట్ ఎయిర్‌పోర్ట్
ఎయిర్ పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీస్ క్వాలిటీ ప్రోగ్రాం అనేది వరల్డ్ వైడ్‌గా విమానాశ్రయ ప్రయాణికుల సంతృప్తి స్థాయులను కొలిచేందుకు ఒక బెంచ్ మార్క్‌గా పరిగణిస్తారు. ఇది విమానాశ్రయాల పరిమాణం, ప్రాంతం, సిబ్బంది అంకితభావం, సులభతరమైన విమానాశ్రయ ప్రయాణం, ఆహ్లాదకరమైన వాతావరణం(Pleasant atmosphere), పరిశుభ్రత లాంటి పలు అంశాల ఆధారంగా విమానాశ్రయాలకు ర్యాంకింగ్స్(Rankings) ఇస్తారు. అయితే.. వీటన్నింటిలో శంషాబాద్ ఎయిర్ పోర్టు మంచి మార్కులు తెచ్చుకోవటంతో.. ప్రపంచంలో “ది బెస్ట్ ఎయిర్ పోర్టు”గా నిలుస్తోంది.