భాతర మహిళల(India Womens) క్రికెట్ జట్టు మరోసారి అదరగొట్టింది. బ్రిస్టల్(Bristol)లోని కౌంటీ గ్రౌండ్లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్‌పై 24 రన్స్ తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యం పొందింది. కాగా ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ నట్ స్కివర్-బ్రంట్ బౌలింగ్ ఎంచుకోగా, భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్ ఆరంభంలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్ సెంచరీ చేసి ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన (13)తోపాటు మరో ఓపెనర్ షెఫాలీ వర్మ (3), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (1) త్వరగా ఔట్ కావడంతో భారత్ 31/3తో కష్టాల్లో పడింది.
రోడ్రిగ్స్, అమన్ అమన్‌జోత్ హాఫ్ సెంచరీలు
అయితే, జెమిమా రోడ్రిగ్స్ (63) మరియు అమన్‌జోత్ కౌర్ (63 నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 93 రన్స్ జోడించారు. రిచా ఘోష్ (32) వేగవంతమైన ఇన్నింగ్స్‌తో ముగింపులో స్కోరు 20 ఓవర్లలో 181/4కు చేరింది. ఇంగ్లండ్ బౌలర్ లారెన్ బెల్ 2/17తో రాణించింది.
బౌలింగ్‌లో రేణుకా, దీప్తి అదరగొట్టారు..
182 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆరంభంలోనే ఒత్తిడిలో పడింది. సోఫియా డంక్లీ (9) రనౌట్ కాగా, టామీ బ్యూమాంట్ (54) ఒక్కొక్కరూ పోరాడారు. అయితే, భారత బౌలర్లు రేణుకా సింగ్ (3/24), దీప్తి శర్మ (2/19) గట్టి పట్టు సాధించారు. నట్ స్కివర్-బ్రంట్ (32) పోరాడినా, ఇంగ్లండ్ 20 ఓవర్లలో 157/7కే పరిమితమైంది. భారత బౌలింగ్‌లో రేణుకా, దీప్తిలు కీలకంగా రాణించారు. అమన్‌జోత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఇరుజట్ల మధ్య ఈనెల 4న లండన్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
Two wins out of two for #TeamIndia 🥳
A victory by 24 runs in Bristol as India take a 2⃣-0⃣ lead in the T20I series 👏👏
Scorecard ▶️ https://t.co/j4IYcst6GO#ENGvIND pic.twitter.com/FsgcZNVInW
— BCCI Women (@BCCIWomen) July 1, 2025






