VD-Rashmika: విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న కాంబోలో మరో మూవీ?

రౌడీబాయ్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం ‘కింగ్‌డమ్’ (Kingdom) మూవీతో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా మే 30న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉండటంతో ప్రజెంట్ ‘కింగ్‌డమ్’ పనుల్లో బిజీగా ఉన్నాడు విజయ్. ఇక ఈ మూవీ అనంతరం ఈ రౌడీ హీరో టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ (Solid project) చేయనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే విజయ్, రాహుల్ కాంబోలో వచ్చిన ‘టాక్సీవాలా’ సినిమా హిట్ అందుకోవడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

రష్మిక రిప్లైతో క్లారిటీ..

అయితే.. గత కొద్ది రోజులుగా ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తున్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ మూవీ టీమ్ హింట్ కూడా ఇచ్చేశారు. ఈ మేరకు మొదట మైత్రి మూవీ మేకర్స్, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ #HMMLetsee అంటూ X వేదికగా రష్మికను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన రష్మిక కూడా.. యస్ గాయ్స్ అంటూ రిప్లై ఇచ్చింది. ఇక ఈ హింట్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక కాంబో మరోసారి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం ఇవ్వలేదు.

Find out how Vijay Deverakonda and Rashmika Mandanna are going an extra  mile for their Hindi film debut

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *