రౌడీబాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా, గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా సినిమా ‘కింగ్‌డమ్(Kingdom)’ నుంచి సత్యదేవ్(Satya Dev) కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా సత్యదేవ్ క్యారెక్టర్ పోస్టర్(Poster)ను గురువారం సాయంత్రం విడుదల చేసి, అభిమానుల్లో ఉత్సాహం నింపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, రెండు భాగాలుగా విడుదల కానుంది. పోస్టర్‌లో సత్యదేవ్ ఇంటెన్స్ లుక్(Satyadev’s intense look)లో కనిపించారు. ఈ మేరకు ‘తుఫానులాంటి భయంకరమైన వ్యక్తి.. త్వరలో బిగ్ స్క్రీన్‌పైకి రాబోతున్నాడు.. హ్యాపీ బర్త్‌డే శివ’ అంటూ అతని పాత్రను రివీల్ చేశారు.

పోస్టర్ విడుదలతో సినిమాపై పెరిగిన అంచనాలు
కాగా ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్యదేవ్ పాత్ర కథలో కీలక మలుపును తీసుకురానుందని తెలుస్తోంది. ఈ పోస్టర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఫిబ్రవరి 12న విడుదలైన టీజర్‌లో NTR వాయిస్ ఓవర్ అభిమానులను ఆకట్టుకుంది. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చాయి.మొదట మే 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం, ప్రమోషన్(Promotions) కార్యక్రమాల్లో ఆటంకాల కారణంగా జులై 4కి వాయిదా పడింది. ఆ తర్వాత అనివార్య కారణాలవల్ల ఈ నెల 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Wishing #SatyaDev a birthday as fierce as the storm he’s bringing to the Big Screen soon 📷 – Team #Kingdom 📷#HappyBirthdaySatyadev 📷 #HBDSatyaDev pic.twitter.com/DsU8bmlsmH
— TeluguMirchi (@TeluguMirchiCom) July 4, 2025






