Edgbaston Test Day-3: ఎడ్జ్‌బాస్టన్‌‌లో సిరాజ్ కమాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston, at Birmingham)లో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్(India vs England 2nd Test) రెండో టెస్టు మ్యాచ్‌లో శుభ్‌మన్ సేన ఆధిపత్యం కనబరుస్తోంది. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్లు బ్రూక్ (158), స్మిత్ (184 నాటౌట్) భారీ శతకాలతో తొలి రెండు సెషన్లు భారత బౌలర్లను విసిగించారు. ఈ క్రమంలో టీ బ్రేక్ తర్వాత కొత్తబాల్ అందుకున్న టీమ్ఇండియా(Team India) ఆ వెంటనే డబుల్ సెంచరీ దిశగా సాగుతున్న బ్రూక్‌(Brook)ను ఆకాశ్ దీప్ అద్భుత బంతితో బౌల్డ్ చేశాడు. ఇక ఆ తర్వాత సిరాజ్(Siraj) నిప్పులు చెరిగే బంతులతో వోక్స్(5), కార్స్ (0), టంగ్ (0), బషీర్ (0)లను వెంటవెంటనే పెవిలియన్ చేర్చాడు. దీంతో ఇంగ్లండో 89.3 ఓవర్లలో 407 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 180 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో సిరాజ్ 6 వికెట్లతో చెలరేగగా, ఆకాశ్ దీప్(Akash deep) నాలుగు వికెట్లు పడగొట్టాడు.

వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి..

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్ 51 పరుగుల వద్ద జైస్వాల్ (28) వికెట్ కోల్పోయింది. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 64/1తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం 244 పరుగుల లీడ్‌లో ఉంది. నాలుగో రోజు(శనివారం) ఆటలో భారత్ వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి ఇంగ్లండ్‌కు భారీ టార్గెట్‌ను ఇవ్వాలని గిల్(Gill) సేన భావిస్తోంది. తొలి మ్యాచులో 350కిపైగా లక్ష్యాన్ని ఇచ్చినా ఇంగ్లండ్ బ్యాటర్లు ఛేదించిన విషయం తెలిసిందే. దీంతో 450 పరుగుల టార్గెట్ ఇస్తే సేఫ్‌గా ఉండొచ్చని క్రికెట్ మాజీలు అంటున్నారు.

Image

గిల్ అద్భుత డబుల్ సెంచరీ

కాగా అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగుల భారీ స్కోరుతో ఆలౌట్ అయింది, దీనికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) అద్భుతమైన డబుల్ సెంచరీ (269)తో చెలరేగాడు. దీంతో ఇంగ్లండ్‌లో భారత కెప్టెన్‌గా డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. అలాగే విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాల రికార్డులను అధిగమించాడు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *