
మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’ (Kannappa). ఈ నెల 27న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్(AP)లో టికెట్ ధరల(Ticket Rates) పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 50 జీఎస్టీ అదనం (Kannappa Ticket Rates Hike in AP) వరకూ పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కాగా.. దాదాపు పదేళ్లుగా ఆయన దీని కోసం వర్క్ చేశారు.
అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్
డైరెక్టర్ ముకేశ్ కుమార్‌సింగ్(Director Mukesh Kumar Singh) తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆయన టైటిల్ పాత్ర పోషించగా.. రుద్రగా ప్రభాస్(Prabhas), కిరాతగా మోహన్‌లాల్, శివుడిగా అక్షయ్‌కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్, మహదేవ శాస్త్రిగా మోహన్‌బాబు(Mohan Babu) నటించారు. అన్నిరకాల చట్టపరమైన అనుమతులతో ‘కన్నప్ప’ను విడుదల చేస్తున్నామని నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేర్కొంది. కాగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్(Advance Bookings) బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.
పలు రికార్డులు స్వాధీనం చేసుకున్న అధికారులు
కాగా బుధవారం సాయంత్రం మంచు విష్ణు (Manchu Vishnu)కు చెందిన కార్యాలయాల్లో కేంద్ర GST ఇంటెలిజెన్స్ విభాగం చేపట్టిన తనిఖీలు ముగిశాయి. మాదాపూర్, కావూరి హిల్స్‌లోని ఆయన ఆఫీస్‌ల్లో రెండు బృందాలు తనిఖీలు చేశాయి. ‘కన్నప్ప’ (Kannappa) సినిమాకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పన్ను(Tax) ఎగవేత జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
#Kannappa – Ticket Hike – AP – ₹50/- pic.twitter.com/TpA0TTKn7H
— Aakashavaani (@TheAakashavaani) June 25, 2025