ప్రముఖ ఫిన్‌టెక్(FinTech) ప్లాట్‌ఫామ్ పేటీఎం (Paytm) కొత్త సదుపాయం తీసుకొచ్చింది. UPIతో అనుసంధానం అయిన బ్యాంకు అకౌంట్ల(Bank Accounts)లోని బ్యాలెన్స్(Balance) మొత్తాన్ని ఒకే చోట చూపించే వెసులుబాటును తీసుకొచ్చింది. మాన్యువల్‌గా అకౌంట్లో బ్యాలెన్స్ కూడడం, వేర్వేరు యాప్స్‌లోకి వెళ్లాల్సిన అవసరాన్ని ఇది తప్పిస్తుంది. అన్ని అకౌంట్లలోని మొత్తం బ్యాలెన్స్‌తో పాటు ఒక్కో అకౌంట్లో ఎంతుందో కూడా చూపిస్తుంది. ఏ బ్యాంకు అకౌంట్‌లో ఎంత మొత్తం ఉందో తెలుసుకోవాలంటే ఇంతకుముందు ఒక్కో బ్యాంకు ఖాతా చెక్ చేసుకోవాల్సి వచ్చేది. అన్నింట్లో కలిపి ఎంతుందో చూడాలన్నా సొంతంగా కూడుకోవాల్సి వచ్చేది.
యూపీఐ పిన్ వెరిఫికేషన్ పూర్తయ్యాక..
ఇకపై పేటీఎం(Paytm) యాప్‌లో యూపీఐ పిన్ వెరిఫికేషన్(Pin Verification) పూర్తయ్యాక అన్ని బ్యాంకు అకౌంట్లలోని మొత్తాలను ఒకే చోట చూపిస్తుంది. సేవింగ్స్(Savings), శాలరీ, ఖర్చుల కోసం వేర్వేరు అకౌంట్లు నిర్వహించే వారికి ఈ సదుపాయం ఉపయుక్తంగా ఉంటుంది. పేటీఎం యాప్‌లో బ్యాలెన్స్ అండ్ హిస్టరీలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఒక్కో ఖాతా పిన్ ఎంటర్ చేయగానే యాప్ పై భాగంలో చూపిస్తుంది.
The new feature announced by Paytm allows users to check their bank balance across UPI-linked accounts in real-time.https://t.co/PSvTcb42Mv
— Express Technology (@ExpressTechie) June 25, 2025






