ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ప్రజారోగ్య సేవల(Public health services)పై కూటమి ప్రభుత్వం మొదటి నుంచి దృష్టి సారించిన విధంగా అత్యాధునిక సదుపాయాలతో కూడిన కొత్త తరహా అంబులెన్సులు(ambulances) త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. ప్రస్తుతం ఉన్న YCP ప్రభుత్వ కాలంలోని నీలం రంగు బదులుగా, తెలుపు, ఎరుపు, పసుపు రంగుల సమ్మేళనంతో, రిఫ్లెక్టివ్ టేపులతో ఈ వాహనాలు ఆకర్షణీయంగా తయారవుతున్నాయి. ఈ అంబులెన్సులకు ‘సంజీవని(Sanjeevani)’ అనే కొత్త పేరు పెట్టగా, వాటిపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), సీఎం చంద్రబాబు(CM Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan), ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఫొటోలు ముద్రించబోతున్నారు.
మెరుగైన సేవలందించేందుకు
ఈ అంబులెన్సుల తయారీ పనులు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలోని కుశలవ్ కోచ్ ఫ్యాక్టరీ(Kusalav Coach Factory)లో వేగంగా జరుగుతున్నాయి. ప్రజలకు అత్యవసర సమయాల్లో మెరుగైన సేవలందించేందుకు అవసరమైన వెంటిలేటర్లు, హెల్త్ మానిటరింగ్ సిస్టమ్స్, ట్రాకింగ్, కమ్యూనికేషన్ పరికరాలు ఈ వాహనాల్లో అమర్చనున్నారు.

ప్రస్తుతానికి 104 ఎమర్జెన్సీ వాహనాలే మొదటి విడతగా అందుబాటులోకి రానుండగా, రాష్ట్రవ్యాప్తంగా రోడ్డుపై ఇవి సంచరించేందుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ, సత్వర వైద్య సాయం అందించడమే ఈ మార్పుల లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి.






