New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. దరఖాస్తులు ఎప్పటినుంచంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం(AP Govt) ప్రజలకు శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డు(New Ration Cards)ల దరఖాస్తు ప్రక్రియను DEC 2 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియను DEC 28 వరకు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) నిర్ణయించారు. అర్హులను గుర్తించి సంక్రాంతి కానుక(Sankranti Gift)గా నూతన కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే ప్రస్తుత రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు కూడా అవకాశం కల్పించనున్నారు. కొత్తగా పెళ్లైన వారికి వివాహ ధ్రువీకరణ(Marriage Certificate) పత్రం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. డిసెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల(In Village and Ward Secretariats)లో రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ చేపడతారు.

 త్వరలోనే విధివిధానాలు

ఇదిలా ఉండగా దరఖాస్తులు పూర్తయిన తర్వాత అర్హులను గుర్తించి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం(AP Govt) భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి విధివిధాల(Procedures)ను ఖరారు చేసి అధికారిక ప్రకటన(
Official announcement) చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే రేషన్ కార్డు రంగు, డిజైన్‌(Color, design)ను కూడా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త చిహ్నాలు, రంగులతో నూతన రేషన్ కార్డులు తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. గత YCP ప్రభుత్వం నాటి రేషన్ కార్డుల డిజైన్‌ను పూర్తిగా మార్చనుంది. దీనిపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

తెలంగాణలోనూ కొత్త రేషన్ కార్డులు

రేషన్ కార్డులు(Rations Cards) లేక వేలాది మంది పేదలు సంక్షేమ పథకాల(Welfare schemes)ను పొందలేకపోతున్నారు. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు చేసిన ప్రకటనతో వీరిలో ఆశలు చిగురించాయి. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు వస్తే ఆ తర్వాత నుంచి ప్రతి సంక్షేమ పథకానికి వీరు అర్హత పొందనున్నారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కూడా కొత్త రేషన్ కార్డులను త్వరలోనే మంజూరు చేయనుంది. ఇప్పటికే విధివిధానాలు ఖరారు చేసింది. సంక్రాంతి నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వం గతంలో చెప్పింది.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *