ఏపీ(Andhra Prsadesh)లోని రాష్ట్రంలోని విద్యార్థులకు(Inter Students) ఇంటర్ బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ(Intermediate Public Advanced Supplementary Exams) పరీక్షల కోసం పరీక్ష ఫీజు(Fee) చెల్లింపు గడువు తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ(Andhra Pradesh) ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల(Inter Supplementary Examination) కోసం గత నెల(ఏప్రిల్) 15 నుంచి 22 వరకు ఫీజు చెల్లించాలని మొదట విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోరిక మేరకు మే 3వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఆ గడువు నేటితో ముగియనుండగా తాజాగా మరో రెండు రోజులు పెంచుతూ విద్యాశాఖ(Education Department) నిర్ణయం తీసుకుంది.

ఈనెల 12 నుంచి 20 తేదీ వరకు పరీక్షలు
దీంతో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ నెల 5 వరకూ సప్లిమెంటరీ పరీక్షల(Inter Supplementary exams-2025) కోసం ఫీజు చెల్లించవచ్చు. అయితే మరోసారి గడువు పొడిగింపు ఉండబోదని ఇంటర్ బోర్డు(AP Inter Board) కార్యదర్శి కృతికా శుక్లా స్పష్టం చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు(Exams) ఈ నెల 12వ తేదీ నుంచి 20 తేదీ వరకు జరగనున్నాయి. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 గంటల నుంచి 5.30 వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్(Practicals Exams) మే 28 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి.








