AP Mega DSC: మెగా డీఎస్సీ పోస్ట్‌పోన్.. కారణం ఏంటంటే?

ManaEnadu: ఆంధ్రప్రదేశ్‌(AP)లో నిరుద్యోగులు(
Unemployes) ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2024(
Mega DSC 2024) ప్రకటన వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ (NOV 6) డీఎస్సీ నోటిఫికేషన్‌(DSC Notification) విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల Dsc ప్రకటనను అధికారులు వాయిదా వేశారు. సోమవారం TET ఫలితాలను ప్రకటించిన అధికారులు.. మరో రెండ్రోజుల వ్యవధిలో 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడుతుందని పాఠశాల విద్యాశాఖ(School Education Department) నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించింది. దీంతో వెంటనే మెగా డీఎస్సీని కూడా విడుదల చేస్తారని అంతా ఆశించారు. కానీ ఊహించని రీతిలో డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటన వాయిదా (Notification Announcement Postponed) పడింది.

 ఎస్సీ రిజర్వేషన్లే కారణమా

మరోవైపు మెగా డీఎస్సీ వాయిదా పడటానికి ఎస్సీ రిజర్వేషన్లే(SC reservations) కారణమని తెలుస్తోంది. SC వర్గీకరణ అమలు చేసే వరకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయకూడదని MRPS డిమాండ్‌ చేస్తుంది. SC రిజర్వేషన్లతో ఎస్సీలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆక్షేపిస్తుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వర్గీకరణ పూర్తయ్యే వరకు డీఎస్సీ ప్రకటన ఇవ్వడానికి వీలులేదని డిమాండ్‌ చేస్తోంది. ఈ రీజన్‌తోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

 సీఎంగా తొలి సంతకం దీనిపైనే

కూటమి సర్కారు కొలువుతీరిన తొలిరోజునే 16,317 పోస్టులను భర్తీ చేసేలా మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) సంతకం చేశారు. ఎక్కువ ఖాళీలు భర్తీ చేయనుండటంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. ఇందులో SGT 6371 పోస్టులు, SA 7725 పోస్టులు, TGT 1781 పోస్టులు, PGT 286 పోస్టులు, ప్రిన్సిపల్ 52 పోస్టులు, PET 132 పోస్టులు ఉన్నాయి.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *