Medicover Hospital: పేషెంట్ చనిపోయిన విషయం దాచి.. కాసుల కోసం కక్కుర్తి!

ManaEnadu: ప్రస్తుతం వైద్య సేవలు.. ఓ బిజినెస్‌(Business)గా మారిపోయాయి. కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు(Private hospitals) మనిషి ప్రాణాలనూ లెక్కచేయడం లేదు. సాయం కోరి ఆసుపత్రులకు వెళితే అందినకాడికి దండుకుంటున్నారు. అమాయక ప్రజల అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకొని పేషెంట్లతో ఆడుకుంటున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు ఏదో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఠాగూర్ సినిమా(Tagore movie)లో ప్రాణం పోయిన వ్యక్తికి ట్రీట్‌మెంట్(treatment) చేస్తున్నట్లుగా మేనేజ్ చేసి పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేసే సీన్ అందరికి గుర్తుండిపోతుంది. ఇప్పుడు అదే స్టైల్లో హైదరాబాద్ మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రి(Madapur Medicover Hospital) వైద్యులు కూడా అలాగే సీన్ క్రియేట్ చేశారు. ఇంతకీ ఏమైదంటే..

 చనిపోయిన విషయం బయటికి చెప్పకుండా..

తాజాగా మాదాపూర్‌లోని మెడికోవర్ ఆసుపత్రి వైద్యుల తీరుపై ఓ రోగి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగప్రియ(Junior Dr Nagapriya) అనే జూనియర్ డాక్టర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితో ఇప్పటి వరకు రూ.3 లక్షలు కట్టించుకున్న వైద్యులు(Doctors) మరో 4లక్షలు కట్టాలని బంధువుల్ని డిమాండ్ చేశారు. అంత డబ్బు కట్టే పరిస్థితి లేకపోవడంతో ట్రీట్ మెంట్ విషయంలో జాప్యం(Delay in treatment) చేశారు. దీంతో పేషెంట్ నాగప్రియ చనిపోయింది. ఈ విషయం బయటికి చెప్పకుండా త్వరగా డబ్బులు కడితేనే వైద్యం కొనసాగిస్తామని, లేకపోతే ఆపేస్తామని చెప్పారు. దీంతో ఎలాగోలా నాగప్రియ బంధువులు ఈరోజు రూ.లక్ష కట్టారు. అయితే కొన్నిక్షణాల్లోనే ఆమె చనిపోయిందని(That it died) వైద్యులు చెప్పడంతో ఆమె బంధువులు షాకయ్యారు.

 ఆస్పత్రి ఎదుట ఆందోళన

మృతదేహం కోసం నాగప్రియ బంధువులు మెడికోవర్ హాస్పిటల్ దగ్గర ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. కేవలం డబ్బు(Money) కోసమే మెడికోవర్ ఆసుపత్రి వైద్యులు పేషెంట్ చనిపోయిన విషయాన్ని గోప్యంగా ఉంచారని బంధువులు ఆరోపిస్తున్నారు. డబ్బుల కోసం కక్కుర్తి పడి వైద్యం ఆపేయడంతోనే తమ బిడ్డ చనిపోయిందని ఆందోళనకు దిగారు. పైగా మిగతా డబ్బు కడితేనే మృతదేహాన్ని(dead body) అప్పగిస్తామని బెదిరింపులకు దిగారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

Share post:

లేటెస్ట్