
ఏపీ(Andhra Pradesh)లో నామినేటెడ్ పదవుల(Nominated posts) కోలాహలం నెలకొంది. ఇటీవల వివిధ జిల్లాల్లోని 47 మార్కెట్ యార్డులకు ఛైర్మన్ల(Chairmans of Market Yards)ను నియమించి విషయం తెలిసింది. ఇందులో రిజర్వేషన్ కేటగిరీల(Reservation categories)ను పరిగణలోకి తీసుకుని, మహిళలకు కూడా ప్రాధాన్యమిస్తూ ఈ జాబితాను ప్రకటించింది. యార్డు ఛైర్మన్ పదవుల్లో TDP నుంచి 37 మందికి, జనసేన నుంచి 8 మందికి, BJP నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది.
TDPకి 31, జనసేనకి 6, BJPకి 1 పదవి
తాజాగా శుక్రవారం (ఏప్రిల్ 4) మరో 38 కమిటీలకు ప్రభుత్వం ఛైర్మన్లను ప్రకటించింది. ఇందులో 31 టీడీపీకి, 6 జనసేన(Janasena)కు, ఒకటి BJPకి దక్కింది. త్వరలోనే మిగతా కమిటీలకు ఛైర్మన్లను ప్రకటిస్తామని TDP వెల్లడించింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా 218 మార్కెట్ కమిటీలున్నాయి. కాగా ఛైర్మన్ పదవుల్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్(Rule of Reservation) ప్రకారం నిర్ణయిస్తున్నట్లు సమాచారం.