Visakhapatnam: ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం: ప్రధాని మోదీ

మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Narendra Modi) బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌(AP)లో పర్యటించారు. ఈ క్రమంలో బుధవారం (జనవరి 8) విశాఖపట్నంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను PM ప్రారంభించారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్‌(Visakha AU Engineering Ground)లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఏపీపై తన అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు వచ్చిందని మోదీ పేర్కొన్నారు. CM చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు కేంద్రం అండగా ఉంటుందని చెప్పారు.

ఏపీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతోంది

ఇంకా ప్రధాని ఏమన్నారంటే ‘ఆంధ్రప్రదేశ్ అన్ని అవకాశాలు ఉన్న రాష్ట్రం. అభివృద్ధిలో APకి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. మీ ఆశీర్వాదంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు ప్రసంగాన్ని విన్నాను. రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం. AP ప్రజల సేవే తమ సంకల్పం’ అని ప్రధాని అన్నారు. అలాగే విశాఖలో దక్షిణ రైల్వే జోన్‌(Southern Railway Zone)కు పునాది వేశామని.. ప్రత్యేక రైల్వేజోన్‌తో ఏపీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతోందన్నారు. రైల్వే జోన్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతోందని, పర్యాటక రంగంతో కొత్త అవకాశాలు కూడా లభిస్తాయని వెల్లడించారు.

రాష్ట్ర పునర్‌ నిర్మాణం చేస్తున్నాం: చంద్రబాబు

అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలే అయ్యింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మెుదటిసారిగా రాష్ట్రానికి ప్రధాని మోదీ వచ్చారు. వచ్చిన వెంటనే రూ.2.08,545 కోట్లతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారంటే AP పట్ల ఆయన నిబద్ధత ఏంటో తెలుస్తోంది. ఇలాంటి పనులన్నీ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న వ్యక్తి ప్రధాని మోదీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వేళ ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పిన వ్యక్తి మోదీ. 7 మండలాలను రాష్ట్రంలో విలీనం చేసిన వ్యక్తి మోదీ. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్‌ నిర్మాణం(Reconstruction of the state) చేస్తున్నాం. సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేసి తీరుతాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ మాట్లాడారు. కాగా సభకు భారీగా జనం హాజరయ్యారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *