Mana Enadu : ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ (Apple) భారత్‌లో తయారీ, విక్రయ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రెండు స్టోర్లను ప్రారంభించి భారతీయ కస్టమర్లకు సేవలందిస్తున్న యాపిల్ సంస్థ.. త్వరలోనే మరో నాలుగు యాపిల్ రిటైల్ స్టోర్లను ప్రారంభించనుంది. ఇప్పటికే ముంబయి (Mumbai Apple Store), దిల్లీలో ఉన్న స్టోర్లకు వచ్చిన ఆదరణ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో నాలుగు స్టోర్లను ప్రారంభించాలని నిర్ణయించింది.
త్వరలో నాలుగు యాపిల్ కొత్త స్టోర్లు
మరోవైపు భారత్‌లో ఐఫోన్-16 (iPhone 16 Series) సిరీస్ తయారీ గురించి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. భారత్‌లో తమ స్టోర్లను పెంచడంపై యాపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్‌డ్రే ఓబ్రియన్ ఆనందం వ్యక్తం చేశారు. బెంగళూరు, పుణె, దిల్లీ – ఎన్సీఆర్, ముంబయిలో కొత్త స్టోర్లు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల ఉత్పత్తిని భారత్‌లో ప్రారంభించినట్లు తెలిపారు.
త్వరలోనే మేడిన్ ఇండియా ఐఫోన్ 16 ప్రో
‘మేడ్ ఇన్ ఇండియా (Made In India)’ ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ మోడళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు ఎగుమతులు చేయనున్నాం. రానున్న కొన్నేళ్లలో 25శాతం ఐఫోన్ల ఉత్పత్తి భారత్‌లోనే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఐఫోన్16 సిరీస్.. మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు ఈ నెలలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అని యాపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట డీర్ డ్రే ఓబ్రియన్ వెల్లడించారు.
వచ్చే ఏడాదిలో అందుబాటులోకి కొత్త స్టోర్లు
వచ్చే ఏడాదిలో కొత్త స్టోర్లు (Apple New Stores) అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఇక 2017లోనే యాపిల్ భారత్‌లో ఐఫోన్ల తయారీని ప్రారంభించిన విషయం తెలిసిందే. 2023 ఏప్రిల్‌లోనే దిల్లీ, ముంబయిలో రెండు రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. వీటికి భారీగా ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ స్టోర్లను భారత్ లో పెంచాలని యాపిల్ సంస్థ నిర్ణయించింది.






